4, ఫిబ్రవరి 2011, శుక్రవారం
26, జనవరి 2011, బుధవారం
భారత మాతకు జేజేలు !!! బంగరు భూమికి జేజేలు !!!
మా భారత పతాకమా
మా జాతి పతాకమా
ఎగరేస్తాం మళ్ళీ పైపైకీ
మా గుండెల ఊపిరి నింపి
ఒక్కో తరం, ఒక్కో తరం
ఎంత నలిగిపొయ్యావో
ఎంత మాసిపొయ్యావో
నీ ఎదుగుదలకు అడ్డమైన
ముళ్ళ కంపనూ పెళ్ళగించి
జనం బతుకు మలుపుల్లో
ఏరువాక పొంగిస్తాం........
ఏ అవసర దూరాలను
నీ గొంతై కలుపునో
ఏ అలజడి తీరాలను
నీ నడకై నిలుపునో..
అదే యాస, అదే బాస
శ్వాస శ్వాసకూ పంచి
ఉద్యమాల కనురెప్పల
రెపరెపలై జీవిస్తాం.
నిను రెపరెపలాడిస్తాం....భారత్ మాతాకి జై......
భారత మాతకు జేజేలు !!! బంగరు భూమికి జేజేలు !!!....
20, జనవరి 2011, గురువారం
నీకై తలచి నిన్ను స్మరించే మీరని నేను
ప్రపంచంలో నువ్వొక చివరన నేనొక చివరన నీ మనసు నా మనసుతో మాట్లాడిన మాటలు
ఎన్ని మరుపుకుట్లు వేస్తున్నా నన్ను భాధపెడుతూ మళ్లి మళ్లి నోరు విప్పుతూనే ఉన్నాయి
నా నుండి నీవు దూరం అయినప్పటికి సరే ఈ గాయం అనంతకాలం స్రవిస్తూంటుంది
నీ పిలుపు వినలేని నా ప్రాణంవిలవిల్లాడినప్పుడు ఒక అపరిచిత స్వరం వినబడుతూంటుంది
నా ఎదురుచూపుకు అనుక్షణం నీకు నిదురే (రానీయ)లేదని నాకు తెలిసిపోయినా
ఎగిరొచ్చాక కనీసం నీ నీడనైన తాకుతనో లేదో అన్న భాధను నే ఊహించగలనా
సెలవు దొరకలేని నా జీవిత బాటలో నీ కన్నీళ్లు తుడువని సుదూర పక్షిలా మిగిలిపోయాను
ఇప్పుడు రెక్కలు అమర్చుకోని ఎగిరివస్తున్నా ఈ అన్వేషణకు ఏ ఫలితం ఇస్తావో చెప్పలేను
మనం ఇద్దరం ఒకటి కావాలనుకున్నా గాయాల పుండును నయం చేసి ఒకటిగా కలుపుతావో
లేక కొంచెమైనా మనించలేకపోతున్న కొన్ని హృదయాలకు మన ప్రేమను త్యాగం చేస్తావో
అంతా నీ ఇష్టం..కానీ నీకై తలచి నిన్ను స్మరించే...మీరని నేను....ప్రేమ పిపాసిని నేను
12, జనవరి 2011, బుధవారం
స్పూర్తి ప్రదాత - యుగపురుషుడు - స్వామి వివేకానంద
జీవితం ఓ నిండు మేఘంలా ఉండాలనుకోవడం సరికాదు. అడ్డంకులు, ఉరుములు, సవాళ్ల పిడుగులు, సమస్యల చినుకులు ఖచ్ఛితంగా మీద పడతాయి. అంత మాత్రాన కృంగిపోవాలా? అవసరం లేదు. మన జీవితానికి మనమే రూపకర్తలం. భవిష్యత్ కాన్వాస్ని... అద్భుత చిత్రంగా మలచుకోవడమా... పిచ్చి గీతల పాల్జేయడమా... అన్నది మన చేతుల్లోనే వుంది. చేయాల్సిందల్లా వివేక నేత్రం తెరచి విశాల ప్రపంచాన్ని చూడటమే. ఇనుప కండలు, ఉక్కు నరాలు బిగించి... ఎదురుపడే సమస్యలను దూది పింజల్లా చేయండి. వాన వెలిశాక హరివిల్లు వచ్చినంత సుందరంగా ఉంటుంది. అప్పుడు సహనంతో, సాహసంతో విజయ పథంలో ముందుకు సాగిపొండి!
నెత్తుటిలో కసి......గుండెల్లో నమ్మకముంటే కొండల్ని సైతం కరిగించగల సత్తా ఒక యువశక్తిలోనే దాగి వుంది. వారి శక్తిసామర్థ్యాలు అలాంటివి. మరి ఏ దేశం అభివృద్ది చెందాలన్నా ఆ దేశంలోని యువశక్తిని సద్వినియోగం చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. దేశ భవిష్యత్తు నిర్ణయించగల ప్రతిభావంతులు వారే!!
నీకు నువ్వు కడుపారా తినడం కాదు....మనకోసం నిరీక్షిస్తున్న ఆర్తులు, ఆనాధలు, అభాగ్యులు ఎందరో ఉన్నారు. వారిని ఉద్దరించడమే మనముందున్న ద్యేయం.
వివేకానందుని ప్రసంగాలు యుగయుగాలకు స్పుర్తిదాయకం. ఆయన యువతలోని శక్తిని మేల్కోలిపారు. ఆయన ప్రసంగాలు విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి. ఆయన ఓ ప్రచార కర్త కాదు. ఓ మతం . ప్రతి మనిషి ఆత్మలో దైవత్వన్ని చూడడం ఆ మత సూత్రం పేదవాడి సేవే భగవంతుని సేవ అని చాటి చెప్పారు. ఈ రోజు ఆయన జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యువజనోత్సవలు నిర్వహిస్తారు.
జనవరి 12 వివేకానంద జయంతి సందర్బంగా ఆయన వెల్లండిచిన స్పుర్తి మంత్రాలు మరోసారి మీకోసం....
* వేదకాలానికి తరలిపోండి.
* ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
* మనం అంటే మన అలోచనలు అవే మనల్ని రూపొందించాయి. మాటలకన్నా అవేముందుంటాయి జీవిస్తాయి నడిపిస్తాయి .
* భయమే మృత్యువు భయం పాపం నరకం పెడతోవలోని జీవితం. ప్రంపంచంలోని అన్ని వ్యతిరేక భావనలూ దాన్లోంచి జీవిస్తాయి.
* ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
* సింహం అంత నిర్బయత్వం పువ్వులాంటి మృదుత్వం... మన పనిలో ఇవి రేండూ ఉండాలి.
* ఎక్కడ విసిరితే అక్కడే అంటుకుపోయే లక్షణం బంకమన్నుకు ఉంటుంది. మన మస్తిష్కం కూడా అలా ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని మీద మనసు లగ్నం కావాలి.
* స్వచ్ఛత,సహనం,కాపాడుకొవడం ఈ మూడూ విజయనికి అత్యంతఅవసరం .ప్రేమవీటన్నింటికన్నా అత్యున్నతం
* మనల్ని అజ్ఞానంలోకి అనెట్టేదెవరు? మనమే అర చేతులతో కళ్లు మూసుకుని అయ్యో చీకట్ల ఉన్నాం అనుకుంటుంటాం.
* ఎవరిని తీసిపారేయద్దు చులకన చేయద్దు వీలైతే చేయుతనందించు. వీలు కానప్పుడు చేతులు జోడించి. వారి తోవలో వాళ్లని వెళ్లానీ.
* దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.
* పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
* అనుభవం ఎకైక గురువు మనం ఎన్నయినా మాట్లాడవచ్చు,హేతుబద్ధంగా తర్కించవచ్చు. కాని అనుభవంలోంచి దర్శిస్తేనే సత్యం బోధపడుతుంది.
* మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.
* మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.
* ఏ సమస్య ఎదురుకాని రోజు నువ్వు తప్పు దారిలో నడుస్తున్నట్టు లెక్క ఒక్కసారి నిన్ను నీవు సమీంక్షించుకో.
7, జనవరి 2011, శుక్రవారం
తు నహీతో కుచ్ బీ నహీ
నీవు లేనిదే నా మనసు ఉండలేదని నీ పేరు లేనిదే నా ప్రేమ ఊహించలేనని
స్నేహమై వచ్చి ప్రేమగామారి నా కంటనీరు చిందినవేళ నేనున్నానని నను ఓదార్చి
ఎవరులేని ఒంటరి పయనంలో నీకు తోడు నేనని నా మసుసు తలుపులు తెరచి
అంతలోనే ఏమైందని అలా దూరంగా వెళ్లిపోతున్నావు..............???????????
నాపై నీకు ప్రేమ లేకుంటే ఇదంతా ఎందుకు చేశావు
ప్రేమే నేరమనుకున్న నీవు ఆ ప్రేమని నాకెందుకు పరిచయం చేశావు
కలనైనా నినుచూడక ఉండలేని నన్ను ఎందుకు కాదంటున్నావు
నీ చెలిని కావాలనుకున్ననా కోరికను ఆచరణ లేని నీ ఆలోచనతో
మన పరిచయం అంతా గతమే అన్నట్టు నా ప్రేమను ఆదిలోనే తుంచేస్తున్నావు
నను నడి సంద్రములో వదిలేసి తీరం చేరని మన ప్రేమను ఎందుకు ఆపుతున్నావు
నీలోగిలిలో చిరునవ్వుల విరబోత చూసి తరించాలన్న నా మధురోహల్ని ఎలా మరువను
ప్రతిక్షణం నాచిరునామా నీవే అనుకున్న నన్ను అసలు నిన్ను ఎలా మరిచిపోను
చెప్పు ప్రియా??....ఎక్కడికి పారిపోతున్నావు??
ఎందాక??.....ఎంతకాలం??......ఏదారి వెంట??
నిన్ను ప్రశ్నిస్తేనే నా జీవితం....నా జీవితం కోసం నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను
నా ప్రశ్నకి బదులులివ్వగలవా..??
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)