అదుగో అరబ్బుల అందాల నగరం
అంటూ పక్షుల్లా చేరాను ఇటు వాలి
మొదటి రోజుల్లో చూసారూ బంగారు గని
కాని నేడు చేయలని లేదు ఇక్కడ పని
తిరిగి వెళితే అమ్మ కాదనదు కానీ
వూరి వారు అంటారెమొ, వచ్చావా పని మాని
ఒంటరి తనం అనే వొనమాలు నేర్చుకోని
ఏకంగ ఏకాకినై జీవచ్చవంలా బ్రతికేస్తున్నా
ఇదేనేమో జీవితానికి మరుపురాని రోజు
తీరెదెన్నాళ్లకు దూర దేశం పై మోజు