జీవితం ఓ నిండు మేఘంలా ఉండాలనుకోవడం సరికాదు అడ్డంకులు ఉరుములు,సవళ్ల పిడుగులు,సమస్యల చినుకులు కచ్చితంగా మీద పడతాయీ. అంతమత్రాన కుంగిపోవాలా? అవసరం లేదు. మన జీవితానికి మనమే రుపకర్తలం. భవిష్య కాన్వనీ ని... అద్భుత చిత్రంగా మలచుకోవడమ... పిచ్చి గీతల పాల్జేయడమ... అన్నది మన చేతుల్లోనే వుంది.చేయాల్సిందల్లా వివేక నేత్రం తెరచి విశాల ప్రపంచాన్ని చుడటమే. ఇనుప కండలు, ఉక్కు నరాలు బింగించి... ఎదురుపడే సమస్యలను దూది పింజల్లా చేయండి.వాన వెలిశాక హరివిల్లు వచ్చినంతా సుందరంగా ఉంటుంది.అప్పుడు సహనముతో,సాహసంతో విజయ పథంలో ముందుకు సాగిపొండి!
జనవరి 12 వివేకనంద జయంతి సందర్బంగా ఆయన వెల్లండిచిన స్ప్రుర్తి మంత్రాలు మీ కోసం ...
* వేదకాలానికి తరలిపోండి.
* ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.
* మనం అంటే మన అలోచనలు అవే మనల్ని రూపొందించాయి. మాటలకన్నా అవే ముందుంటాయి జీవిస్తాయి నడిపిస్తాయి .
* భయమే మృత్యువు భయం పాపం నరకం పెడతోవలోని జీవితం. ప్రంపంచంలోని అన్ని వ్యతిరేక భావనలూ దాన్లోంచి జీవిస్తాయి.
* ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
* సింహం అంత నిర్బయత్వం పువ్వులాంటి మృదుత్వం... మన పనిలో ఇవి రేండూ ఉండాలి.
* ఎక్కడ విసిరితే అక్కడే అంటుకుపోయే లక్షణం బంకమన్నుకు ఉంటుంది. మన మస్తిష్కం కూడా అలా ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని మీద మనసు లగ్నం కావాలి.
* స్వచ్ఛత,సహనం,కాపాడుకొవడం...ఈ మూడూ విజయనికి అత్యంత అవసరం . ప్రేమ వీటన్నింటికన్నా అత్యున్నతం
* మనల్ని అజ్ఞానంలోకి అనెట్టేదెవరు? మనమే అర చేతులతో కళ్లు మూసుకుని అయ్యో చీకట్లో ఉన్నాం అనుకుంటుంటాం.
* ఎవరిని తీసిపారేయద్దు చులకన చేయద్దు వీలైతే చేయుతనందించు. వీలు కానప్పుడు చేతులు జోడించి. వారి తోవలో వాళ్లని వెళ్లానీ.
* దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.
* పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.
* అనుభవం ఎకైక గురువు మనం ఎన్నయినా మాట్లాడవచ్చు,
హేతుబద్ధంగా తర్కించవచ్చు. కాని అనుభవంలోంచి దర్శిస్తేనే సత్యం బోధపడుతుంది.
* మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.
* మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.
* ఏ సమస్య ఎదురుకాని రోజు నువ్వు తప్పు దారిలో నడుస్తున్నట్టు లెక్క ఒక్కసారి నిన్ను నీవు సమీంక్షించుకో.
12, జనవరి 2010, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)