నా కల చెల్లాచెదురై నా అడుగులే సుడిగుండాలై
నే కన్నీరు పెడుతుంటే నన్ను ఆదుకోని
మనసు మురిపించి మమత కలిగించి
మరులు గొలిపించి మమతానురాగాలు పంచి
మధురిమ ఝరివై అద్భుత సమమై
నా కంట ఆనందభాస్పాలు ఒలికించి
నా కష్టాలకు ఆసరనిస్తూ నా ఆశయలకు ఊపిరినిస్తూ
నా విజయాలను ఆకాంక్షిస్తూ నా ప్రగతిని ఆనందిస్తూ
నాకు తోడుగా నిలబడ్డావు
ఈ రోజు కనుచూపుకి అందనంత దూరానికి వెళ్లావు
అమృతమయి, అనురాగమయి
కరుణామయి, నా స్నేహమయి
నా కనుచూపుకి అందనంత దూరానికి వెళ్లావు గాని
నా మనోనేత్రానికి అందనంత దూరం కాదు స్నేహమ