దేశ ప్రగతి కోసం పగలు రేయి అనక పరవశించి పరుగులు పెడుతు
కనులుతేరచిన క్షణం నుండి ఎంతటి కష్టాన్ని అయిన ఆనందంగా భరిస్తూ
దూది వొత్తులతో చీకటిని పాలద్రోలి అనునిత్యం వెలుగును నింపుతున్నారు
నాన్న రాక కోసం తన బిడ్డల ఎదురుచూపులు తెలియవు వీరికి
పోరులో మరణించయిన సరే దేశ భవిష్యత్తు కాపాడాలి అని ఆలోచన
పోరులో మరణించయిన సరే దేశ భవిష్యత్తు కాపాడాలి అని ఆలోచన
ప్రతి సైనికుడికి
దొంగ పాకిస్తాన్ తుపాకి తుటాలకు రాలిపోతున్న ప్రాణాలు కూడ లెక్క చేయక
''వందేమాతరం'' అంటు నేలకొరుగుతు అంబరాన్నంటిన అరుపునకు
''వందేమాతరం'' అంటు నేలకొరుగుతు అంబరాన్నంటిన అరుపునకు
అందుకోండి మా సలాం ఓ భారతమాత ముద్దు బిడ్దలార
దేశం కోసం ఏస్వార్ధం లేని ప్రేమను పంచుతు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండ
భారతమాత సేవలో అనుక్షణం పునీతులగుచున్న వీరసైనికులారా
మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగల సలాం చేయడం తప్ప
వెల కట్టలేని మీ త్యాగలకు ధైర్యసాహసాలకు జోహర్లు
మీకు వందనం! శతకోటి అభినందన చందనం!!..భారతమాతకి జై.....జై హింద్