♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

29, జనవరి 2010, శుక్రవారం

ఓ స్రీ ఆవేదన





కాలేజీ లో చూసి (నచ్చితే) మాట కలపడమెందుకు?


స్నేహం పేరుతో దెగ్గరవుతూ చనువు పెంచుకునేదెందుకు?


అటు పిమ్మట అది స్నేహం కాదు...ప్రేమ అని నమ్మబలకడమెందుకు?


నువ్వే సర్వస్వం...నువ్వేనా జీవితం అని కల్లబొల్లి మాటలెందుకు?


పెద్దలని ఎదిరించైనా నిన్ను పెళ్ళి చెసుకుంటానని అబద్ధమెందుకు?


అలా చెప్పి ఎలాగొలా లోబరుచుకోవటమెందుకు?


ఆ తర్వాత నువ్వెవరో నాకు తెలియదంటూ నాటకాలెందుకు?


సిగ్గుతో, ఇంట్లో, జరిగిన విషయం చెప్పి..


మీ పెద్దల్ని వొప్పించి..


అడిగింది కాదనకుండా ఇచ్చి.


.మీ కోర్కెల్ని తీర్చి....


మీ ఇంటికి కాపురానికి వస్తే...


మాకు మీరిచ్చేది...వాతలు...రోజూ దెబ్బలు...మా మీద అభాండాలు.


అన్నీ సహించి ..భరించి..సహనంతో వుంటే...


కట్నం పేరుతో ..కసాయికన్నా ఘోరంగా హింసించి...


మీ కౄరత్వం ప్రదర్శించి....చావగొట్టి ...మా పుట్టింటినుంచి..తెప్పించుకోవల్సినవన్నీ...రాబట్టాక. ...


మరో యువతి జీవితాన్ని...


పాడుచేయటానికి....నేను అడ్డు అని చెప్పి...


నా నోరు నొక్కి..నన్ను నూనె లో ముంచిన వొత్తి లా కిరోసిన్ తో తడిపి ఒక జ్యోతి గా మార్చి....


నా చావుని ఆనందించి...


నా తనువుని అర్ధాంతరంగా చాలించాల్సినంత పని చెసింది మీరు ఇలా చెయ్యడమెందుకు?



ఏ?



మేము మనుషులం కామా?


మాకు బ్రతికే హక్కు లేదా?


ఇవన్నీ చదివిన తర్వాత... మాకు మీరు చేసేదాంట్లో...


మేము మీకు చేసేది ఏపాటిదో......అర్ధమయ్యే ఉంటుంది.


ముందు మీరు మారండి...ఈ పురుషాహంకారాన్ని ఆపండి..... ఆ తర్వాత మాలో మార్పుని చూడండి.