వీధి దాటి ఊరు దాటి మాత్రు దేశాన్ని వదిలి పరాయి దేశంలో ప్రవస ఆంధ్రున్ని
కాళ్ళకు కళ్ళెం, చేతులకు, సంకెళ్లు కండ్లకు గంతలు, ఆశకు అంతులు, వేసుకొని
ఘడియలు, క్షణలు, గంటలు, రోజులు, గడుపుతు నా జీవిత ప్రయణం
అంతలో
నీతో మాట ఉంది చెవిలో చెప్పాలి సమయం బాగుందని బ్లాగుతో ఒకరి పరిచయం
అబ్బో ఇదేదో బహు బాగుందని అని మెరిసింది నామదిలో ఏదో కలవరం
ఇంక ఆలోచనేలేదు అనుకోని లేఖిని పలకతో మొదలు పెట్టను నాబ్లాగు బడి
నామకరణంలో కొన్నిసార్లు మార్పులు మొత్తానికి బుజ్జి భ్రమరంగా మనసుతో పలికి
ఎలా రాస్తున్నానో నాపై నాకే అనుమానం ఎవరు చూడరు ఎవరు కనబడరుఅంటు కాలం గడుపుతున్న నాకు అడుగడుగున ఎదురైంది అశభంగం
కార్చలేని కన్నీటిని హృదయంలో నిలుపలేక కళ్లలో ఆపలేక
బుజ్జి భ్రమరం జల జల రాల్చేసిన కన్నీరుని చూసి అది నేను తాళలేక
అప్పుడు నాకు సిరివెన్నెల గుర్తొచ్చి బుజ్జిని ఓదారుస్తు ఇలా ప్రేమ ఒలిక
సరేలే ఊరుకో పరేషానెందుకో
చలేసే ఊరిలో జనాలె ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా
ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా
మేరా నాం బ్లాగరు మేరా కాం తుంకు ఖుషి కరుం
నువ్వు నా చేతిలో ఓ బుజ్జి బ్లాగరు
anything కోరుకో క్షణల్లో హాజరు
ఖరీదేం లేదు కాని వాలుగా ప్రతి బ్లాగులోనా ఓ మైన
క్లాప్స్ కొట్టి ఈల వేసే స్పందన నీకు రాద
అంటు నా బుజ్జిని బుజ్జగించి చేశాను మళ్లి ఓ ప్రయత్నం
హారంతో అల్లుకోమని జల్లెడతో జతకలసి
మాలికతో మాటలాడి కూడలికి కూడ కబురంపింది
బుజ్జి భ్రమరం ప్రతి బ్లాగులోను వాలి సుమధుర మకరందా సువాసనాలు విరజిమ్మింది
భలే మాయ అపై మొదలు అయ్యయి కొత్త పరిచయలు హాయిని పంచే స్పందనలు
వారి ఆశీస్సులతో నేను రాసుకుంటు పోయను నా రాతలు మున్ముముందు
అల రాసుకుంటు వేదురుని తాకిన గాలి వేణునాధం అయిన కవితలతో, మనిషిబతుకులోని హీతభోద తెలిపిన వివేకనంద సూక్తులతో శ్రమ జీవుల కష్టాలని మరిపించే లయభరిత గానం జనపద గేయలతో అజరమరంగా రంజింపజేసింది నా బుజ్జి బ్లాగు వసంతం పూర్తి చేసుకోని మరో వసంతంలోకి అడుగు పెట్టిన సందర్బన మీరు నా బుజ్జి భ్రమరనికి కొంచెం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుదురు :))