♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

12, జనవరి 2011, బుధవారం

స్పూర్తి ప్రదాత - యుగపురుషుడు - స్వామి వివేకానంద


జీవితం ఓ నిండు మేఘంలా ఉండాలనుకోవడం సరికాదు. అడ్డంకులు, ఉరుములు, సవాళ్ల పిడుగులు, సమస్యల చినుకులు ఖచ్ఛితంగా మీద పడతాయి. అంత మాత్రాన కృంగిపోవాలా? అవసరం లేదు. మన జీవితానికి మనమే రూపకర్తలం. భవిష్యత్ కాన్వాస్ని... అద్భుత చిత్రంగా మలచుకోవడమా... పిచ్చి గీతల పాల్జేయడమా... అన్నది మన చేతుల్లోనే వుంది. చేయాల్సిందల్లా వివేక నేత్రం తెరచి విశాల ప్రపంచాన్ని చూడటమే. ఇనుప కండలు, ఉక్కు నరాలు బిగించి... ఎదురుపడే సమస్యలను దూది పింజల్లా చేయండి. వాన వెలిశాక హరివిల్లు వచ్చినంత సుందరంగా ఉంటుంది. అప్పుడు సహనంతో, సాహసంతో విజయ పథంలో ముందుకు సాగిపొండి!

నెత్తుటిలో కసి......గుండెల్లో నమ్మకముంటే కొండల్ని సైతం కరిగించగల సత్తా ఒక యువశక్తిలోనే దాగి వుంది. వారి శక్తిసామర్థ్యాలు అలాంటివి. మరి ఏ దేశం అభివృద్ది చెందాలన్నా ఆ దేశంలోని యువశక్తిని సద్వినియోగం చేసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. దేశ భవిష్యత్తు నిర్ణయించగల ప్రతిభావంతులు వారే!!


నీకు నువ్వు కడుపారా తినడం కాదు....మనకోసం నిరీక్షిస్తున్న ఆర్తులు, ఆనాధలు, అభాగ్యులు ఎందరో ఉన్నారు. వారిని ఉద్దరించడమే మనముందున్న ద్యేయం.



వివేకానందుని ప్రసంగాలు యుగయుగాలకు స్పుర్తిదాయకం. ఆయన యువతలోని శక్తిని మేల్కోలిపారు. ఆయన ప్రసంగాలు విదేశీయులను సైతం ఆకట్టుకున్నాయి. ఆయన ఓ ప్రచార కర్త కాదు. ఓ మతం . ప్రతి మనిషి ఆత్మలో దైవత్వన్ని చూడడం ఆ మత సూత్రం పేదవాడి సేవే భగవంతుని సేవ అని చాటి చెప్పారు. ఈ రోజు ఆయన జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యువజనోత్సవలు నిర్వహిస్తారు.

జనవరి 12 వివేకానంద జయంతి సందర్బంగా ఆయన వెల్లండిచిన స్పుర్తి మంత్రాలు మరోసారి మీకోసం....

* వేదకాలానికి తరలిపోండి.

* ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.

* మనం అంటే మన అలోచనలు అవే మనల్ని రూపొందించాయి. మాటలకన్నా అవేముందుంటాయి జీవిస్తాయి నడిపిస్తాయి .

* భయమే మృత్యువు భయం పాపం నరకం పెడతోవలోని జీవితం. ప్రంపంచంలోని అన్ని వ్యతిరేక భావనలూ దాన్లోంచి జీవిస్తాయి.

* ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

* సింహం అంత నిర్బయత్వం పువ్వులాంటి మృదుత్వం... మన పనిలో ఇవి రేండూ ఉండాలి.

* ఎక్కడ విసిరితే అక్కడే అంటుకుపోయే లక్షణం బంకమన్నుకు ఉంటుంది. మన మస్తిష్కం కూడా అలా ఉండాలి. ఏ పని చేస్తే ఆ పని మీద మనసు లగ్నం కావాలి.

* స్వచ్ఛత,సహనం,కాపాడుకొవడం ఈ మూడూ విజయనికి అత్యంతఅవసరం .ప్రేమవీటన్నింటికన్నా అత్యున్నతం

* మనల్ని అజ్ఞానంలోకి అనెట్టేదెవరు? మనమే అర చేతులతో కళ్లు మూసుకుని అయ్యో చీకట్ల ఉన్నాం అనుకుంటుంటాం.

* ఎవరిని తీసిపారేయద్దు చులకన చేయద్దు వీలైతే చేయుతనందించు. వీలు కానప్పుడు చేతులు జోడించి. వారి తోవలో వాళ్లని వెళ్లానీ.

* దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.

* పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది.

* అనుభవం ఎకైక గురువు మనం ఎన్నయినా మాట్లాడవచ్చు,హేతుబద్ధంగా తర్కించవచ్చు. కాని అనుభవంలోంచి దర్శిస్తేనే సత్యం బోధపడుతుంది.

* మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.

* మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.

* ఏ సమస్య ఎదురుకాని రోజు నువ్వు తప్పు దారిలో నడుస్తున్నట్టు లెక్క ఒక్కసారి నిన్ను నీవు సమీంక్షించుకో.

14 కామెంట్‌లు:

చెప్పాలంటే...... చెప్పారు...

వివేకానందుని మాటలు....మీ టపా చాలా బావున్నాయి....

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గౌరవనీయులు వివేకానందులవారి జయంతి రోజున ఆయన చెప్పిన మంచి మాటలు కొన్ని చెప్పినందుకు ధన్యవాదాలు.
మొదటి వాక్యాల్లో భవిష్య ..ఏదో రాయాలనుకున్నారు. కానీ మళ్ళీ పరిశీలించలేదేమో. కాన్వాసా ?

మనసు పలికే చెప్పారు...

నో కామెంట్స్.. చాలా మంచి టపా అశోక్.

అశోక్ పాపాయి చెప్పారు...

స్పందించిన మీ అందరికి చాల కృతజ్ఞతలండి.మందాకిని గారు అవునండి ఇంకా కొంచెం విషయం వ్రాద్దామని అనుకున్న కాని హడవిడిలో కుదరలేదండి...మీరు పరిశిలన బాగుంది ధన్యవాదాలు.

Ennela చెప్పారు...

ashok,
manchi postu..idi mee modati tapana? (kavitalu kaakunda).meeru marinni manchi vishayaalu maatho panchukovalani aasistunnaanu..meeku subhabhinanadanalu

veera murthy (satya) చెప్పారు...

ఆస్వాదించ లేనిదే అందించ లేము ....

బాధ్యతలు నిర్వర్తించ లేనిదే బంధాలనుంచి బయటపడలేము ...

ప్రేమించ లేనిదే ప్రేమేమిటో చెప్పలేము ...

'వివేకానందు' లం కాకుండా వివేకానందుడంటే ఎంటో తెలుసుకొలేము ...

శిశిర చెప్పారు...

బాగుందండి. ఆయన ఎవరికైనా స్ఫూర్తిప్రదాతే. చిత్రంగా మనమిద్దరం ఒకే రోజు ఒకే విషయం మీద టపా రాస్తున్నాం. మొన్న కవిత గురించి, ఈరోజు వివేకానందుడి గురించి. :)

అజ్ఞాత చెప్పారు...

అశోక్ పాపాయిగారూ!
బాగుందండీ మీ టపా. చాలా రోజులుగా మిమ్మల్ని ఇతర బ్లాగుల్లో చూస్తున్నాను, కానీ మీ బ్లాగు చూడటం కుదరలేదు. ఈ రోజు ఓ మంచి టపాతో మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.
నేనుకూడా వివేకానందులవారిపై ఓ టపా (ఓ యువకా మేలుకో, పుట్టుకతో వృద్ధుణ్ణి కానని చాటుకో-A Tribute to Swami Vivekananda on His Birth Anniversary(National Youth Day, 12th January)) వ్రాసాను.
u can see here:
http://dare2questionnow.blogspot.com/2011/01/tribute-to-swami-vivekananda-arise.html

అజ్ఞాత చెప్పారు...

శిశిర గారూ!
నేను కూడా వ్రాసానండోచ్:)

అశోక్ పాపాయి చెప్పారు...

ఎన్నెల గారు ఇదివరకు ఒకటి రాశ కాని అంతవరకే ఆపేశ..కాని రాయలి అని అనిపిస్తూంది మీరు చెప్పిననుండి మీరు చెప్పింది కచ్చితంగా దృష్టిలో ఉంచుకుని మరిన్ని టపాలు మీతో పంచుకుంటానని చెపుతూ మీకు కృతజ్ఞతలు.


సత్యగారు మీరు కూడ చాల బాగరాశారు. మీ బ్లాగ్ చూశనండి. చాల బాగుంది ధన్యవాదాలు.


శిశిరగారు హ హ్హహ్హహ్హ భలే భలే కదండి ఒకే రోజు ఒకే విషయం మీద టపా ఇద్దరం. అవునండి చాల చిత్రంగా వుంది:))anyway both are good writings.:))మీకు కృతజ్ఞతలు


RSReddy సార్ మీరు వీలుచూసుకుని నా బ్లాగ్ కు వచ్చినందుకు నాకు చాల సంతోషమండి.మీ బ్లాగ్ చూశనండి.వివేకానందుని పై మీరు రాసిన టపా బాగుంది మీకు కృతజ్ఞతలు.

శివరంజని చెప్పారు...

నో కామెంట్స్.అశోక్ పాపాయిగారూ!
బాగుందండీ మీ టపా

భాను చెప్పారు...

good post

అశోక్ పాపాయి చెప్పారు...

శివరంజని,భాను గారు మీకు ఈ టపా నచ్చినందుకు ధన్యవాదాలు.

suresh చెప్పారు...

chlala manchi sukthulu chupincharu



thank q