నువ్వు నా చేరువలో ఉండాలని ప్రయత్నించినప్పుడు
నేను మన మధ్య ఎంతగానో అగాధం త్రవ్వను
అగాథపుటంచుల నుండి నీ మూగ భాష వినిపిస్తుంటే
వేల మైళ్ల దూరం ఎగిరిపోయి ఇప్పుడు కరిగిపోయాను
కాని ఇప్పుడు నా తప్పుని సరిదిద్దుదామనుకున్నా నువ్వు లేవు
అందుకే కాబోలు మన మధ్య దూరం మాత్రం ఇలాగే మిగిలింది
అయిన నీతో చెప్పాలని వుంది నీతో చెప్పాలని ఉన్నది
కలలో ఇలలో నిన్నే కోరుకున్నానని కలకాలం తోడుగ ఉండాలని
పై రూపం చూసి నిన్ను అభిమానించ లేదని
మాటున దాగిన మనసును మెచ్చే వలచానని
మమత తప్ప ఏమి లేని నిస్సహయున్ని నేనని
నీ మనసును కానుకిస్తే తెగ సంబరపడతానని
చెప్పాలని ఉన్నది నీతో చెప్పాలని ఉన్నది