♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

26, జనవరి 2011, బుధవారం

భారత మాతకు జేజేలు !!! బంగరు భూమికి జేజేలు !!!


మా భారత పతాకమా
మా జాతి పతాకమా
ఎగరేస్తాం మళ్ళీ పైపైకీ
మా గుండెల ఊపిరి నింపి
ఒక్కో తరం, ఒక్కో తరం
ఎంత నలిగిపొయ్యావో
ఎంత మాసిపొయ్యావో
నీ ఎదుగుదలకు అడ్డమైన
ముళ్ళ కంపనూ పెళ్ళగించి
జనం బతుకు మలుపుల్లో
ఏరువాక పొంగిస్తాం........
ఏ అవసర దూరాలను
నీ గొంతై కలుపునో
ఏ అలజడి తీరాలను
నీ నడకై నిలుపునో..
అదే యాస, అదే బాస
శ్వాస శ్వాసకూ పంచి
ఉద్యమాల కనురెప్పల
రెపరెపలై జీవిస్తాం.
నిను రెపరెపలాడిస్తాం....భారత్ మాతాకి జై......
భారత మాతకు జేజేలు !!! బంగరు భూమికి జేజేలు !!!....

12 కామెంట్‌లు:

Ennela చెప్పారు...

వావ్ అశోక్...యీ నీ కవిత ఎంత బాగుందంటే...మన భారత దేశమంత బాగుంది...మన తెలుగు నేల మట్టి గుబాళింపు అంత బాగుంది...మన తెలుగు భాష అంత తియ్యగా..బాగా బాగుంది...
ఏ దేశమేగినా ఎందు కాలిడినా....నువ్వు సూపరయ్యా బాబూ...

veera murthy (satya) చెప్పారు...

మంచి ఆవేశం ఝరి ఉంది...చాలా బాగుంది!

durgeswara చెప్పారు...

భారత్ మాతాకీ జై

అశోక్ పాపాయి చెప్పారు...

అమ్మో చాల పెద్దోన్ని చేశారు..కవిత నచ్చినందుకు మీకు చాల చాల చాల కృతజ్ఞతలు..

ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీతల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము

అవును మనము ఎల్లప్పుడు ఇలా భారత దేశ జాతిని కాపాడుకోవాలి..మీరు మరల జ్ఞాపకం చేసినందుకు చాల సంతోషం.


సత్య గారు...మీ స్పందనకు చాల కృతజ్ఞతలండి.

అశోక్ పాపాయి చెప్పారు...

durgeswara jii ... thubolna nabolna sub hindustaani bolona...Bholo Bharath Maatha Ki Jai..

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అశోక్ గారు,
భారత మాతకు జేజేలు

శిశిర చెప్పారు...

good post ashok garu.

అశోక్ పాపాయి చెప్పారు...

మందాకిని గారు...బంగరు భూమికి జేజేలు కృతజ్ఞతలండి.


శిశిర గారు.....మీ స్పందనకు చాల కృతజ్ఞతలండి.

చెప్పాలంటే...... చెప్పారు...

baavundi ashok

శివరంజని చెప్పారు...

అశోక్ గారు గుడ్ పోస్ట్

zylog.chirala చెప్పారు...

No comments.....


Super ashok.


Aruna

కథాసాగర్ చెప్పారు...

మేరా భారత్ మహాన్..

బాగుందండి మీ కవిత..