ప్రతి రోజు నా గురించి పరితపించే నీవు
ఒకమారు నీ అందాన్ని పొగిడి నీ అధరాలపై ఒక ముత్యపు నవ్వు తెప్పించాలని
పక్కనున్న పెరడులో కన్నేసి అందమైన గులాబీ పూలు దోచేసి ముల్లును తాక
తియ్యగా దాని లక్షణంతో నను ఎంతో భాదించినా మధురంగానే భావించా
మది నిండా నీ ఆలోచనలతో ఇంటికి చేరుకొని పడక పై శయనిస్తూ నేను
కొన్ని క్షణాలు ఈలోకాన్ని మరచిపోయి సాగిపోతున్నా నా నిద్దురలో పదే పదే నువ్వే
అంతలో నేను దాచుకున్న పూలలో నిను చూద్దామని చూస్తే దొంగిలించినది కాబోలు
నీతో ముచ్చటిస్తూ నే ముట్టిన ప్రతి పువ్వు నను విడిచి ముచ్చటగా రాలిపోతున్నవి
కాని పాపం చివరన మిగిలింది ఒకేఒక గులాబి మన ప్రేమకి అదే మన ప్రసూనము
మన ఎడడుగుల బంధానికి చేరువకావటానికి ఒకేఒక పువ్వు చాలు అనుకోని
అమయక ప్రేమ పక్షిలా ఒక్కసారిగా నీ ముందర వాల
ఈ పువ్వుని తీసుకొని నీ పెదాలపై చిరునవ్వు చిందించవు
నను మైమరపించవు ప్లీజ్....................