ఒక స్నేహం........
ఓ అందమైన నేస్తమా!
క్షణకాలం నిలువుమా
నా బాధలో తోడు నీవు
నా కన్నీళ్ళకు భవ్యం నీవు
నా ఒంటరితనానికి చేయూత నీవు
నీవు లేని క్షణం నాకు మరణమే క్షణం క్షణం
నను వదిలి ఎచటకు నీ ప్రయణం?
ఒక ప్రేమ........
ఓ ప్రియ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం
నీ కళ్ళల్లోకి చూస్తుంటే సిగ్గు అనిపించదు
మౌనంగా ఉన్న విసుగనిపించదు
నీవు దూరమైతే ఆవేదన ఎప్పుడు నీకై ఆలోచన
అందుకే మరి
నీలి నింగిని సైతం చేరుకుంటాను
సప్త సముద్రాలు సైతం ఈదుతాను
నింగి నేల వున్నంతవరకు వేచివుంటాను
నీ ప్రేమకోసం నీవు ఇచ్చే పువ్వుకోసం
ఒక స్నేహం, ఒక ప్రేమ........
ఆకాశం అసూయ పడుతున్నది నా మీద
నక్షత్రాలకు పెరుగుతున్నది కోపము అంతులేనంత
ప్రజల హృదయాలు రగులుతున్నాయి భరించలేనంత
ఎందుకు?
చంద్రుని మించిన ఒక స్నేహం, ఒక ప్రేమ నాకు సొంతమైనందుకు