♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

20, జనవరి 2011, గురువారం

నీకై తలచి నిన్ను స్మరించే మీరని నేను


ప్రపంచంలో నువ్వొక చివరన నేనొక చివరన నీ మనసు నా మనసుతో మాట్లాడిన మాటలు
ఎన్ని మరుపుకుట్లు వేస్తున్నా నన్ను భాధపెడుతూ మళ్లి మళ్లి నోరు విప్పుతూనే ఉన్నాయి

నా నుండి నీవు దూరం అయినప్పటికి సరే ఈ గాయం అనంతకాలం స్రవిస్తూంటుంది

నీ పిలుపు వినలేని నా ప్రాణంవిలవిల్లాడినప్పుడు ఒక అపరిచిత స్వరం వినబడుతూంటుంది

నా ఎదురుచూపుకు అనుక్షణం నీకు నిదురే (రానీయ)లేదని నాకు తెలిసిపోయినా

ఎగిరొచ్చాక కనీసం నీ నీడనైన తాకుతనో లేదో అన్న భాధను నే ఊహించగలనా

సెలవు దొరకలేని నా జీవిత బాటలో నీ కన్నీళ్లు తుడువని సుదూర పక్షిలా మిగిలిపోయాను

ఇప్పుడు రెక్కలు అమర్చుకోని ఎగిరివస్తున్నా ఈ అన్వేషణకు ఏ ఫలితం ఇస్తావో చెప్పలేను

మనం ఇద్దరం ఒకటి కావాలనుకున్నా గాయాల పుండును నయం చేసి ఒకటిగా కలుపుతావో

లేక కొంచెమైనా మనించలేకపోతున్న కొన్ని హృదయాలకు మన ప్రేమను త్యాగం చేస్తావో

అంతా నీ ఇష్టం..కానీ నీకై తలచి నిన్ను స్మరించే...మీరని నేను....ప్రేమ పిపాసిని నేను
8 వ్యాఖ్యలు:

చెప్పాలంటే...... చెప్పారు...

గాయం మాని మళ్ళి మళ్ళి రేగకుండా మీ ఇద్దరు ఒకటిగా కలకాలం కలిసి వుండాలని మీ ప్రేమ గెలవాలని ప్రేమ కు త్యాగం కాకుండా మీ పెళ్లి తో దాన్ని గెలిపించుకోండి.....:)) గుడ్లక్

Aruna చెప్పారు...

chala chala chala baga rasaru ashok...


Aruna

స్వామి ( కేశవ ) చెప్పారు...

తన పిలుపు వినలేని ప్రాణం విలవిల్లాడుతున్నా,
మనసు మాటలు మరుపు లేని బాధగా మిగులుతున్నా ,
ఎదురు చూపుల్లో , ఎడబాటుల్లో,ఎద కోతల్లో ,
తన వెచ్చటి కన్నీళ్లు తుడవలేని సుదూర పక్షిలా
మిగిలి పోయావని బాధ పడుతున్నావా మిత్రమా ?

తనకోసం నీ అన్వేషణ తప్పక ఫలిస్తుంది ,
తనకోసమే రెక్కలు కట్టుకు వాలుతున్న నీకు
చక్కటి ఫలితం లభిస్తుంది .

ఎగిరొచ్చాకా తన నీడనైనా తాకుతానా ? అని బాధ దిగులు పడకు నేస్తం ,
తన తోడుగా జీవితాంతం , తనతో కలిసి నడిచే నీడ నీదే అవుతుంది .

కొంచెమైనా మన్నించని హృదయాలు కొన్ని ఉంటే,
ప్రేమను అర్ధం చేస్కోలేని స్థితిలో అవి ఉండి ఉంటే,
ఆ హృదయాల ఆలోచనారాహిత్యానికి , నీ ప్రేమ బలికాకూడదు.

ప్రేమించింది త్యాగం చేసేందుకే అయితే ఇంక ప్రేమించటమెందుకు ?
ప్రేమిస్తే గెలవాలి .. గెలిచితీరాలి..

నిజమైన ప్రేమ ఎప్పటికీ ఖచ్చితంగా గెలుస్తుంది ..

( ఎందుకో ఒక్క విషయం గుర్తొస్తుంది నాకు .. .
మన గురించి తెలిసిన మనవారెవ్వరూ మననుంచి వీడిపోరు .
మన నుంచి వీడి పోయేవారే ఉంటే ఖచ్చితం గా వాళ్ళు మనవాళ్ళే కారు )

Ennela చెప్పారు...

"గాయం మాని మళ్ళి మళ్ళి రేగకుండా మీ ఇద్దరు ఒకటిగా కలకాలం కలిసి వుండాలని మీ ప్రేమ గెలవాలని ప్రేమ కు త్యాగం కాకుండా మీ పెళ్లి తో దాన్ని గెలిపించుకోండి"

"చెప్పాలంటె "గారి కామెంటే నాది కూడా....
తొందరగా రెక్కలు కట్టుకుని ఎగిరిపో చిలకా...గూటికి తొందరగా చేరాలని,మీ ప్రేమ ఫలించాలని కోరుకుంటున్నా.

Ennela చెప్పారు...

Swamee gaaru, mee comment chaala touching...oka best friend dorikaaru ashok neeku... you are lucky...

Mauli చెప్పారు...

///మన గురించి తెలిసిన మనవారెవ్వరూ మననుంచి వీడిపోరు .
మన నుంచి వీడి పోయేవారే ఉంటే ఖచ్చితం గా వాళ్ళు మనవాళ్ళే కారు///

Superb!!

సత్య చెప్పారు...

నా గుండెని గుండెకేసుకునే గుండె కొసం
ఈ గుండె పై ఎన్ని గాయాల నైనా భరిస్తా!
తిరుగొస్తానని చెప్పిన నీ కడచూపుల కొసం
ఇక నే యుగయుగాలు నిరీక్షణ లో నిలుస్తా!!

--సత్య

yemek tarifleri resimli చెప్పారు...

kayıp izle izmir çetesi dizisi canan izle sürgün izle canan dizisi izmir çetesi izle bordo bereli izle derin sular dizisi derin sular izle sırat izle ezel final izle cennetin sırları izle yolun başı izle sırat dizisi film izle kaç para dizi izle iffet hanımın çiftliği final izle cennetin sırları izle herşeye rağmen izle