పొద్దు కాస్త పడమటింటికి జారుకుంది
చలిగాలికి మనుషులు, పశుపక్షాది,
కొండలు, కోనలు, పారే సెలయెళ్లు
వేడి ముసుగు వేసుకుని అప్పుడే నిద్రపోతున్నాయి
రెండు జంటలు మాత్రం నిద్రపోకుండా ఏమిటి
ఇక్కడ అని ఏవేవో చంద్రుని కుశల ప్రశ్నలు
మీకు తోడుగా మేము మేల్కోని ఉన్నాం సుమా
అన్నట్టు నక్షత్రాల చిలిపితనపు వంకర చూపులు
ఈ అర్ధరాత్రి చాల వింత అనుభూతినిస్తూంది కదా
అవును ఒకటి చెప్పు............
నాతో ఎదో చెప్పాలని ప్రయత్నించి ప్రతిసారి
విఫలమౌతున్నాను అని అంటావుగా మరి
ఇప్పుడు ఏమి సంభాషించక చలిమంటలకు
మూతి ముడుచుకుని కూర్చుంటే ఎలా??
మనసు తెరలు తెరచి నీ మనసున ఉన్నది ఏంటో చెప్పు