♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

15, అక్టోబర్ 2010, శుక్రవారం

దొరికిపోయాను


తెల్లని మంచులో......
ఎవరు చూడకుండా ఎవరులేని ఏకాంతంలో
కనురెప్పల కిటికీలు మూస్తు తెరుస్తు
ఒక తోటలో కొత్త రంగుల్లో కొత్త రూపాల్లో
పువ్వుల నవ్వులు దోచుకుందామని
వెన్నెల దారిలో ఒంటరిగా బయలుదేరి
నన్ను నేనే పోగొట్టుకొని శిలనై నిల్చున్నాను
పైన కాపల కాస్తున్న చందమామని గమనించలేదు

11, అక్టోబర్ 2010, సోమవారం

తలచి తలచి చూస్తే....



నిన్న రాత్రి ప్రపంచ కౌగిలిలో నిద్రిస్తున్నప్పుడు ఒక్కసారిగా మెళుకువ వచ్చింది సఖి
ఎప్పుడో ఎక్కడో వీడిపోయిన నిన్ను అనుభూతి వెచ్చదనంగా దాచుకున్న డైరీని తెరిచాను

ఆశ ఆశయం ఆనందంతో రాసుకున్న అక్షరాలు రెప రెప లాడుతున్నాయి అని అనుకున్న
ఎమైందో ఎమోగాని తడుముతున్న ప్రతి అక్షరం నాకు ఆవేదనను మిగిల్చింది

ఎన్నో కలల కన్నీరై ఎన్నో ప్రేమల స్మృతి గీతలై
తెల్ల కాగితంలో ఇంకు చుక్కలై ఒక్కోక్కటిగా ఇంకిపోతున్నాయి

కలకాలం నిలివలేక కలసి నాతో రాలేక
కదలిపోయిన నీలా ప్రతి అక్షరం నా నుండి దూరం అవుతున్నాయి

అయిందెదో అయింది జరిగేదేదో జరిగింది అని అనుకుంటే
నీ కోసం వేచి వుండే నా నిత్య నిరీక్షణ వృధానే మరి

ఆవేదన మిగిల్చిన అక్షరాలని నిత్య నూతనంగా మళ్లి వెలిగిస్తాను
ఇంకు చుక్కలై ఇంకిపోతున్న ఆణిముత్యాలని నా రుధిరంతో రుద్ది మరి చక్కదిద్దుకుంటాను
దూరం అయిన ప్రతి అక్షరాన్ని ముద్దాడి సైతం నా హక్కున చేర్చుకుంటాను

వెళ్లిపోయిన నిన్నటి దినాన్ని మరచిపోయి వస్తావని రేపటి నాడు ''గా'' రాసుకోవడనికి

కాగితల్ని మళ్లి మళ్లి సవరిస్తూవుంటాను

ఎప్పుడో ఎక్కడో వీడిపోయిన నిన్ను ''ని'' ఈ కాగితల్లో రోజు వెతుకుతు వుంటాను