26, మే 2010, బుధవారం
కదల్లేని అమ్మకు.........మేమే అమ్మ నాన్న
ఎక్కడుంది మానవత్వం
కీర్తిలోనా? కాంక్షాలోనా?
ఎక్కడుంది నూతనత్వం
ఆశలోనా? ఆశయంలోనా?
అమ్మ
నీ జోలా పాటాతో మురిపించి
మాకు ఈ జగాన్ని మైమరపించవు
అమృతాన్ని ముద్దలుగా చేసి మా నోటికి అందించవు
అబలంతో నీవున్న బండిని లాగుతాం
నీ వొతిళ్ళ మధ్య చలికి వొణకగా
వెచ్చగ ఉంచిన నిను ఎలా మరువగలము
నవమాసాలు మోసి మము కనిన
అనురాగాపు అమృత తల్లివి నీవు
నిను మేము నాలుగు అడుగులు మోసుకెల్లలేమ
అపురూపంగా మా హృదయంలో నిలిచే
మహొన్నత దేవతవు నీవు
కాని ఒక్క విషయం
తల్లి కన్న ప్రేమకు
తల్లి కున్న ప్రేమకు
తల్లి అన్న మాటకు
విలువెంతని ప్రశ్నిస్తే?
ఈ ముగబోయినా లోకానికి తెలియదు
ఎవరు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?
చిన్నతనంలో మాకు వచ్చిన చిన్న జ్వరానికే తల్లడిల్లిన నీవు
నీకు వచ్చిన అర్దంకాని జ్వరానికి నిను అంటిపెట్టుకుని వుండి
నిను కాపాడుకుంటాము అమ్మ నిను కాపాడుకుంటాము
Labels:
అమ్మ,
అమ్మ ప్రేమ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)