అందాల మా చెల్లి
మా ఇంటి ఆనంద దీపావాలి.
నేను ఎంతో బాధపడుతున్న
తను చిన్నప్పుడు నడిచిన బుల్లి అడుగులు నాపై పడలేదని
నేను ఎంతో ఆరాటం చెందుతున్న
తన కష్ట,సుఖాలు నా గుండేల్లో ఇప్పటికి నింపలేదని
నేను ఎంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న
అమ్మ అశయల కొరకు తను చేస్తున్న సాధనను చూసి
మా చెల్లి సంతోషపడె ప్రశంసలు ఎన్నో అందుకుంది
కాని చిట్టీ నిత్యం గర్వింపదగ విజయం కోసం ఎదురుచూస్తుంది
హృదయ ఆవేదనతో అడుగుతున్న అపజయన్ని
మా చెల్లికి ఇక విజయ బిక్ష పెట్టమని
కన్నీటితో చెపుతున్న ఆ కష్టలకి
మా చెల్లి దరిదాపులకు కూడ రావద్దని
ముక్కోటి దేవతలకు నమస్కరిస్తున్న
మా చెల్లి మొహంలో చిరునవ్వులు చిందించమని
-నీ అన్నయ్య
అశోక్
1, జనవరి 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)