ఊరువిడిచి వాడవిడిచి ఎంత దూరమేగినా కన్నవారు ఉన్నవారు అంతరాన వుందురే... అంటాడు ఒక సినికవి. నిజమే ఎవరు ఎంత దూరతీరాలకు వెళ్లినా అయినా వారు ఊరు అంతారాళాల్లోనే వుంటుంది. ఉపాది కోసం వేరే ప్రాంతానికి వెళ్లినా ఉన్నతి లక్ష్యాల కోసం వెళ్లినా వాళ్లకు మనవాళ్లు వున్నారనే భావన ఎంత ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందో మాటల్లో చెప్పలేం ఆత్మబంధువులా సమస్యల్లో ఆదుకుంటే ఆ ఆనందం ఇక అద్వితీయం. అదుగో ఆ భావనతోనే ఆ లక్ష్యంతోనే దుబాయిలో మీ రంజని ఏర్పటైంది. మూడేళ్ల ముచ్చటైన ప్రస్థానంలో మైలురాళ్లుగా అనుభూతుల్ని ప్రోగు చేసుకుంది.మీ అందరి ఆత్మీయతనుబంధాలతో మునుముందు సాగుతుంది. మీ రంజని నిర్వహించిన కార్యాక్రమాలలో ఇవి కొన్ని మెచ్చుతునకలుగ చెప్పుకోవచ్చు. 2007 ఎమెనెస్టి సమయంలో జెట్ స్టాంపులు గురించి ఎండలో గంటల తరబడి వేచివున్న భారతీయులకు ఆహరం, నీళ్లు అందించడం. ఎర్ టికెట్లు కొనలేని తెలుగువారికి ఇండియా వెళ్లడానికి ఉచిత టిక్కెట్లు , ప్రత్యేక విమనం ఏర్పటు చేయడం. విమన టిక్కెట్లు కొనలేని వారికి ఉచిత టిక్కెట్లు కొరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వంపై ఒత్తిడి పెంచడం. ప్రభుత్వం అందించిన 1511టిక్కెట్ల పంపిణి కార్యాక్రమంలో ఇండియన్ ఎంబసీతో కలసి తెలుగు శ్రోతలు పనిచేయడం క్లీనప్ దుబాయ్ కార్యాక్రమంలో తెలుగు రేడియో శ్రోతలు దుబాయ్ మునిసిపాలిటితో సలహలు పొందడం రేడియో హెల్ప్ డెస్క్ ద్వ్రారా ఎంతో మంది తెలుగు వారికి సలహలతో పాటు ఆపన్నహస్తం అందించడం.ప్రభుత్వ రిక్రూట్ మెంట్ ఏజెన్సీకి ఎప్పటికప్పుడు సమచారం చేరవేయడం రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాదులో హెల్ప్ డెస్క్ గురించి ఒత్తిడి తేవడం అక్రమంలోనే తెలుగు వారి సహయం కొరకు హెల్ప్ డెస్క్ ఏర్పడటం.రేడియో శ్రోతల ద్వారా ఇటివల వచ్చిన వరదబాదితులకు 20 వేల ధిరంల విలువచేసే బ్లాంకెట్స్ ఎయిర్ వేస్ లో టివి9 కి పంపించడం.
మూడేళ్లకు పైగా జనరంజకంగా మీ రంజని.....
ఒకప్పుడు తెలుగు వినబడితే చాలు మన తెలుగు వాళ్లు కనబడ్డారు అంటూ సంబరపడిపోయిన తెలుగువాళ్లకు ఈ రోజు కమ్మటి సంగీతంతో పాటు గల గల తెలుగు మట్లాడే రేడియో జాకీలతో గల్ఫ్ లో సుదూర తీరాలకు మన తెలుగు మాట,పాటలను చేరవేస్తూ ఎక్కడో సౌదీ అరేబియాలో కనచూపుమేరలో కాదు కాదు కొన్నికిలొమీటర్ల దూరం వరకు మనిషి జాడ కూడ కనబడని ఎడారిలో ఉంటున్న కూడ తేట తెలుగు కార్యాక్రమాలను అందజేస్తుంది మీ రంజని తెలుగు రేడియో 1152AM. తెలుగు పాటలే కాకుండా అవసరంలో ఉన్న తెలుగు వారికి ఆపన్నహస్తం అందించడానికి నిరంతరం కృషి చేస్తుంది మీ రంజని. ఈ మధ్య వచ్చిన వరద కారణంగా నిలువనీడ కోల్పోయిన తెకుగువారికి సహయర్థంకంగా మీ రంజని తెలుగు రేడియో మరియు ఉయే లో ఊన్న అన్ని తెలుగు అసోసియేషన్లు కలసి దుబాయ్ రెడ్ క్రెసెంట్ వారి సహకారంతో దుబాయ్ జబీల్ పార్క్ లో జరిపిన అద్బుతమైన హర్ట్ బీట్ కార్యక్రమం నిర్వహించడం కూడ జరిగింది.
ఇది మీ రంజని ప్రస్తానం....దుబాయిలో ఉన్న ప్రతి తెలుగువారి ఆత్మీయతానుబంధాల ప్రతిరూపం..!