♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

23, ఆగస్టు 2010, సోమవారం

వస్తావు కదూ.......


నీతో కలసి వేసిన అడుగులు నా మదిలో ఇంకా శాశ్వంతగానే ఉన్నాయి
నీతో ఊహిస్తూ కన్న కలలన్ని చెదరని జ్ఞాపకాలు నను వెంటాడుతునే ఉన్నాయి
నీకు తెలుస........
రోదిస్తూ నేను కూర్చున్న రాయిసైతం నన్ను చూసి జాలిపడుతుంది
మరి నీవు మాత్రం మౌనం చెందిన తపస్విలా చెంతకు రావుకదా
ఇలా ఈ మౌనంలోని ఒంటరితనంలో వేదనతో నేనేమవుతానో నాకే తెలియదు
కాని నీ జాడ తెసిసేదాక ఈ నిరీక్షణ ఆగిపోదు నిను చేరేదాక నా ఆరధనా అలసిపోదు
ఎన్ని కష్టాలయినా ఎదురిస్తాను కన్నీళ్లతోటే నా పయనం అంటాను
ఆనందపు అంచులదాక వెళ్లి అందులోని తృప్తిని అస్వాదిస్తాను
వీడిపోని ఆశతో ఆగిపోని శ్వాసతో నీ ఎదురుచూపులో పరితపిస్తూ వుంటాను
ఆగ్రహించి నన్ను శాపించక కరుణించి నను చేరుకో నీ దానిని చేసుకో
సెలవంటూ వెళ్లిపోయి ఎడబాటు అయిన మన ప్రేమలో మళ్లి సేదతీరాలని
నువ్వు రావాలని............వస్తావని...........నీకై ఎదురుచూస్తానని............