♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

3, డిసెంబర్ 2010, శుక్రవారం

పిడికెడు బువ్వ కోసం


జారిపోయింది తిని సమసిపోయిన మా బ్రతుకులని చూసి అయ్యె అనేగా మీ మాటలు
మరి అంతేగా మా బ్రతుకులు కడుపు తిప్పలు ఏమని వర్ణించాలి మా జీవితలు
ఏదొ పోట్ట నింపుతారని మీ ఇంటికి మా ఆశల అడుగులు చివరికి అడియసలు

చీదరింపులు, చీ..పో దగ్గరికి రాకు అపహస్యం, చేతి సైగలు, మూతి విరుపులు,
మౌనలు, రోకటి పోటుల మాటలు .............

మీరు తినిపారేసినది వీధి కుక్కలు కోతులు తినేసిన మా ఎండిన కడపులను చూసి
ఎంగిలి మెతుకులు జలదరించి తినమన్నవి ఫికరు చెయ్యద్దని పాపం తప్పుకున్నవి

సంక్రాతి సంబరాలకు కార్తిక మాసలకు మీరు చేసుకున్న పరమన్నాలు మాకు వద్దు
పెదల బ్రతుకులు మారేదెన్నడు అనే బదులు మా ఆకలి గానం వింటే అదే మాకు పొద్దు

విందు వినోదలు పండుగల చిందులతో మీ కడుపు నిండిందని మురిసిపోతున్నారు
తినడం తప్ప ఇవ్వడం తెలియని జనాలు కనీసం గొడ్డు కారంతోనైన సరిపెట్టని హృదయలు

అయ్యొ పాపం అనేగా మీ సద్దాన్నాం మాటలు ఏమని వర్ణించాలి మా అతికిన బ్రతుకులు