♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

18, నవంబర్ 2010, గురువారం

చెప్పాలని ఉన్నది


నువ్వు నా చేరువలో ఉండాలని ప్రయత్నించినప్పుడు
నేను మన మధ్య ఎంతగానో అగాధం త్రవ్వను
అగాథపుటంచుల నుండి నీ మూగ భాష వినిపిస్తుంటే
వేల మైళ్ల దూరం ఎగిరిపోయి ఇప్పుడు కరిగిపోయాను
కాని ఇప్పుడు నా తప్పుని సరిదిద్దుదామనుకున్నా నువ్వు లేవు
అందుకే కాబోలు మన మధ్య దూరం మాత్రం ఇలాగే మిగిలింది
అయిన నీతో చెప్పాలని వుంది నీతో చెప్పాలని ఉన్నది
కలలో ఇలలో నిన్నే కోరుకున్నానని కలకాలం తోడుగ ఉండాలని
పై రూపం చూసి నిన్ను అభిమానించ లేదని
మాటున దాగిన మనసును మెచ్చే వలచానని
మమత తప్ప ఏమి లేని నిస్సహయున్ని నేనని
నీ మనసును కానుకిస్తే తెగ సంబరపడతానని
చెప్పాలని ఉన్నది నీతో చెప్పాలని ఉన్నది

9 కామెంట్‌లు:

చెప్పాలంటే...... చెప్పారు...

అబ్బో భలేగా రాసారే....చాలా బాగుంది.చెప్పేసారుగా మీ కోరిక తీరాలని కోరుకుంటూ....

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

"అగాథపుటంచుల నుండి నీ మూగ భాష వినిపిస్తుంటే
వేల మైళ్ల దూరం ఎగిరిపోయి ఇప్పుడు కరిగిపోయాను"
బాగుందండి. ఇలాగే జరుగుతూ ఉంటుంది.

మనసు పలికే చెప్పారు...

భలే రాశావు అశోక్.:) చాలా బాగుంది.

శివరంజని చెప్పారు...

అశోక్ గారు చాలా బాగుంది... ఇలాంటి అందమైన కవితలే కాదు తవికలు కూడా రావు నాకు

అశోక్ పాపాయి చెప్పారు...

మంజుగారు.. హ్హ హ్హ హ్హ అబ్బో మీరు కూడ భలే చెప్పారు ....-)చాల ధన్యవాదములు

మందాకిని గారు....కదా!! మీ కామెంట్ నాకు చాల సంతోషండీ.ధన్యవాదములు

అప్పు....మీకు చాల ధన్యవాదములు..:-)

శివరంజని గారు..మీరు అందమైన హాస్యన్ని మాకు పంచుతున్నప్పుడు ఇంక కవితలు ఎందుకండి మీకు.:-)ఎలగైన మీరు భలే నవ్విస్తారు:-) మీకు చాల ధన్యవాదములు

శిశిర చెప్పారు...

నా కామెంటు పబ్లిష్ కాలేదు? బ్లాగర్ ప్రాబ్లమా? బాగా రాశారు. చాలా నిజాయితీ ఉంది మీ కవితలో. :)

ఇందు చెప్పారు...

చాలా బాగుంది అశోక్ గారు.BTW మీ బ్లాగ్ పేరు కూడా భలె ఉంది 'బుజ్జి భ్రమరం' అని :)

శే.సా చెప్పారు...

అశోక్ గారు బాగుంది మీ కవిత.

అశోక్ పాపాయి చెప్పారు...

శిశిర గారు... అయ్యొ మీ కామెంట్ పబ్లిష్ అయ్యిందండి..:-)మీకు చాల చాల కృతజ్ఞతలు

ఇందు గారు... మీకు నా బ్లాగ్ పేరు నచ్చినందుకు సంతోషం.చాల చాల కృతజ్ఞతలు మీకు


శేషేంద్ర సాయి గారు...చాల చాల ధన్యవాదములు మీకు .:-)