♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

3, డిసెంబర్ 2010, శుక్రవారం

పిడికెడు బువ్వ కోసం


జారిపోయింది తిని సమసిపోయిన మా బ్రతుకులని చూసి అయ్యె అనేగా మీ మాటలు
మరి అంతేగా మా బ్రతుకులు కడుపు తిప్పలు ఏమని వర్ణించాలి మా జీవితలు
ఏదొ పోట్ట నింపుతారని మీ ఇంటికి మా ఆశల అడుగులు చివరికి అడియసలు

చీదరింపులు, చీ..పో దగ్గరికి రాకు అపహస్యం, చేతి సైగలు, మూతి విరుపులు,
మౌనలు, రోకటి పోటుల మాటలు .............

మీరు తినిపారేసినది వీధి కుక్కలు కోతులు తినేసిన మా ఎండిన కడపులను చూసి
ఎంగిలి మెతుకులు జలదరించి తినమన్నవి ఫికరు చెయ్యద్దని పాపం తప్పుకున్నవి

సంక్రాతి సంబరాలకు కార్తిక మాసలకు మీరు చేసుకున్న పరమన్నాలు మాకు వద్దు
పెదల బ్రతుకులు మారేదెన్నడు అనే బదులు మా ఆకలి గానం వింటే అదే మాకు పొద్దు

విందు వినోదలు పండుగల చిందులతో మీ కడుపు నిండిందని మురిసిపోతున్నారు
తినడం తప్ప ఇవ్వడం తెలియని జనాలు కనీసం గొడ్డు కారంతోనైన సరిపెట్టని హృదయలు

అయ్యొ పాపం అనేగా మీ సద్దాన్నాం మాటలు ఏమని వర్ణించాలి మా అతికిన బ్రతుకులు

13 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ashok garu melaga evaru alochincharemo, ala aite epatiki nirupedalu undane undaru...

me vedana chala baga rasaru..

Aruna

మనసు పలికే చెప్పారు...

అశోక్.. ఏంటో.. చదివి మనసంతా అదోలా అయిపోయింది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మన కళ్ల ఎదురుగా ఉన్న నిజాన్ని భరించలేక పోతున్నాను కదా అని. ఎదుటి మనిషికి సహాయం చేసే సమయమూ ఉండదు(??), డబ్బూ ఉండదు(??). ఏమిటో..
మంచి ఆలోచనతో రాసావు. ఏమీ అనుకోనంటే చిన్న సలహా, అక్కడక్కడా అచ్చు తప్పులు దొర్లుతున్నాయి. అవి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.

అశోక్ పాపాయి చెప్పారు...

అప్పు.... నా అచ్చు తప్పుల సంగతి తర్వత కాని

సమయమూ ఉండదు?? డబ్బూ ఉండదు?? అంటున్నారు ఎందుకు??

కాలేజికో ఆఫీసుకో వెళ్తున్నప్పుడు పాదచారులకు మీకు బండి వుంటే లిప్ట్ ఇవ్వండి

పెదల బ్రతుకులని వివరిస్తూ మీ మిత్రులకు మెయిల్స్ పంపండి.

మీకు టైం వునప్పుడు మీ ఊరిలో కంప్యుటర్ పాఠలు చెప్పండి.

ఓ పూట ఏ కలెక్టర్ ఆఫీసు దగ్గర ఆర్డీవో ఆఫీసు దగ్గరో నిలబడి రేషకార్డు కోసమో పింఛను కోసమో వచ్చే నిరక్షరాస్యులకు వృద్దులకు సాయం చెయ్యండి.

సమస్యలో వున్న నలుగురి పెదలకు స్పుర్తిదాయకమైన పుస్తకాన్ని చూసి చదివి పరోక్షంగా ధైర్యం చెప్పండి.

శివరంజని చెప్పారు...

అశోక్ గారు అపర్ణ చెప్పినట్టు మనసంతా ఏదోలా అయిపోయింది ... ....కళ్ళ నీళ్ళు తెప్పించారు ...చాలా ఫీల్ అయి రాశారు మీరు

కొత్త పాళీ చెప్పారు...

అవును, అప్పుడప్పుడూ అయినా మనకంటే దీనస్థితిలో ఉన్నవారికి చెయ్యగలిగినది చెయ్యాలి

Rao S Lakkaraju చెప్పారు...

ఎదుటి వారి జీవితాన్ని కొద్దిగా అన్నా సుఖవంతము చెయ్యగలము అనిపిస్తే మనకెందుకులే అని పోకుండా చేస్తే ఎంతో త్రుప్తి జీవితంలో మిగుల్తుంది. పైన అశోక్ పాపాయి గారు చెప్పినట్లు చాలా చెయ్యవచ్చు.

Unknown చెప్పారు...

పేదవాడి ఆకలి గురించి చాల బాగ రాశారు అశోక్ గారు.బాగుంది మీ కవిత చాల ఫిల్ చేశారు.

అశోక్ పాపాయి చెప్పారు...

అరుణ గారు..కృతజ్ఞతలు లేదండి అందరు ఆలోచిస్తారు కాని పని తీరిక వల్ల వారిని పట్టించుకోవడం లేదు కాని సమయం చూసుకొని వారిని కూడ మనము ఆదరించేది వుంది.


శివరంజని గారు అవునండి ఇది నిజమే ఎందుకంటే మీకు ఒకటి చెప్పానా అయితే మా ఫ్రెండ్ లలితకి ఈ పిక్షర్ చూపించ తను కూడ ఒక్కసారిగా మీలాగే కళ్ల నీళ్లు తెచ్చుకుంది. నేను ఇంక బాగ రాసేవాన్ని కాని ఎదో హడవిడిలో రాసి వెంటనే పోస్ట్ చేశాను. మీరు నా ప్రతి పోస్ట్ కు నన్ను పోత్సహించి కామేంట్ ఎడుతున్నారు మీకు చాల చాల ధన్యవాదములు శివరంజని గారు .


కొత్తపాళీ సార్....చాల ధన్యవాదములు.అవునండీ మీరు చెప్పింది నిజం ఇంకో విషయం సార్ ఇక్కడ కాని మీకు చెప్పేంత పెద్దవాన్ని కాదు అన్యధా భావించద్దు. ఒకనొకప్పుడు గాంధీజీ చరకా సంఘానికి నిధులు సేకరించడనికి దేశమంతా తిరుగుతున్నారు . ఓ గ్రామంలో గాంధీజీ మాట్లాడుతుండగానే..ఓ వృద్దురాలు బాపు కాళ్లకి దండం పెట్టుకుంది. తను చిరచెంగులో భద్రంగా దాచుకున్న రాగినాణాన్ని మహత్ముడికి ఇచ్చింది. ఆయనా దాన్ని అంతే జాగ్రత్తగా దాచుకున్నారు. మహత్మ వేలాది రూపాయలు డబ్బు నాచేతికి ఇచ్హరు కాని ఆ రాగినాణెం మాత్రం ఇవ్వరేం సందేహంగా అడిగారు నిధుల వ్యవహారాలు చూస్తున్న ''జమజ్ లాల్ బజాజ్'' అప్పుడు బాపు ఆ వేల రూపయల కంటె ఈ నాణెం చాల విలువైనది. లక్షల ఆస్తి ఉన్నవాళ్లు వేయి రూపాయలు ఇవ్వడం గొప్పేం కాదు. కానీ ఆ వృద్దురాలు తన దగ్గర వున్న ఒకే ఒక నాణాన్ని నాకు ఇచ్చింది.నా దృష్టిలో ఆమె చాల గొప్ప దాత అని కీర్తించారు బాపు.

నిజానికి కోటిశ్వరుడిచ్చిన వంద రూపాయల కంటే సామన్యుడు ఇచ్చిన పది రూపాయలు చాల విలువైనవి. మీరు చెప్పినట్టుగానే మనకంటే దీనస్థితిలో ఉన్నవారికి చెయ్యగలిగినది చెయ్యాలి.

అశోక్ పాపాయి చెప్పారు...

Rao S Lakkaraju గారు కృతజ్ఞతలు ...జాయ్ ఆఫ్ కింగ్ లో చదివాను మధురైకి చెందిన కృష్ణ అనే యువకుడు వీధుల్లో తిరిగి పిచ్చివాళ్లకు మూడు పుట్ల అన్నం పెట్టడానికి 5star ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు పోద్దున్నే ఓ వ్యాన్లో భోజనం పెట్టుకోని పెదాల గురించి వెతకడమే అతని పని. రోజు నాలుగు వందల కడుపులు నిండుతే కాని కృష్ణకు తృప్తిగా అనిపించదట.


సంధ్య గారు కృతజ్ఞతలు ...మీరు ఉద్యోగి అయితే వందో రెండు వందలో నెల నెల ఏదైన స్వచ్చంద సంస్థలకు కొంచెం విరాళం ఇద్దురూ...

అశోక్ పాపాయి చెప్పారు...

అప్పు తప్పుగా అనుకోవద్దు నేను చెప్పింది నాకు మీకు అందరికి వర్తిస్తుంది. తప్పుగా భావిస్తే మన్నించగలరు.

కొత్త పాళీ చెప్పారు...

@ అశోక్ - ఒప్పుకుంటాను. ఇందులో నేను వేరే అనుకునేందుకేమి లేదు.

sandeep చెప్పారు...

touching.

చెప్పాలంటే...... చెప్పారు...

ashok gaaru,
miru baagaa feel aiyyi mammalni kudaa alochinchetatlu chesaru.Milo vunna maro konam bayata padindi. baagaa raasaru