♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

15, నవంబర్ 2010, సోమవారం

ఓ బాపు నీవే రావలి నీ సాయం మళ్లి కావాలి


అన్యాయలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీలు
మాఫియ గ్యాంగులు ముఠా రాజకీయలు
ఉచిత చదువులకు విలువలేదంటూ డబ్బులతో డిగ్రీలు
అండతో ఉద్యోగాలు సంపాదిస్తూ సంఘంలో పెద్ద మనుషులుగా చెలాయిస్తూ

చనిపోతే తప్ప చల్లరని పగలు ఎంత సంపాదించిన తీరని ఆశలు
ఒక్క జాతిగా ఒప్పుకోలేని జనం కాని అవసరం కోసం బాయి బాయి అని బతికిపోవడం
నీతి నియమాలు విస్మరించి మన మర్యదాలు మంట గలపి

రంగుల తెరపై స్వార్థ స్వప్నల నాటికా కోసం పెదాలకి ఇంత జిగురు పూసి
సొమ్ముకోసం సొమ్ముసిల్లి ఒళ్లును సైతం ఆదమరుస్తున్న నేటి తారల జూదం

ఇంక ఓటు నాడు నీతి కోతలు కోసిన సేత కాని మన జాతి నేతలైతే
రాష్ట పతికి ప్రధాన మంత్రికి తేడ తేలియని పట్ట భద్రులు
హాజరు పట్టి వేసుకుంటే తప్ప అసెంబ్లీకి రాని బడి దొంగలు

పైగా పదవులకై పాకులటలు ప్రజలను విడదీసె ఆటలు
వరదలు వానలు వచ్చి ఏమి లేక బుక్కెడు కూడు కూడ ప్రభుత్వం నుండి నొచుకోలేక
జనాల ఆకలికేకల గానం చెవులార విన్న నిదులు ఎన్ని వున్న పెదాలకు మాత్రం సున్న
మరి ఇదేందిరో అమెరికా నుండి తెల్లదొరలు పోయి నల్లదొర విచ్చేస్తున్నాడనగానే
పైసల కట్టలకు ప్రాణం వచ్చి దొంగ పాలు చేసి పారాయిల పాలయిపోతుంటే
మన దేశంపైనే పాచిక వేసిన ఇలాంటి దొరలకు మరి పెట్టిన ఖర్చురాతకు రావు లెక్కకందవు

అందుకే ఓ బాపు నీవు మళ్లి రావలి ఇలాంటి దుర్మరగ్గలు ఆపాలి
ఇట్లు
వానర జాతి.........
ఎందుకంటే ఇది అంత చేసేది మనుషులే కనుక

9 కామెంట్‌లు:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మంచి ఆవేశంతో రాసావు అశోక్.. బాగుంది. ఎంతమంది బాపులొచ్చినా ఇప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయలేరు. అది మీలాంటీ యువతకే సాధ్యం..

గీతిక చెప్పారు...

చాలా బాగుంది...

చెప్పాలంటే...... చెప్పారు...

మీ ఆలోచనాత్మక కవిత బావుంది. ఎన్ని చావులోచ్చినా ఇలాంటి వాళ్ళు పుడుతూనే వుంటారు.మార్పు రావాల్సింది వ్యవస్థలోనే. దానికి నడుం కట్టాల్సింది అందరూను.... మంచి టపా రాసారు...

చెప్పాలంటే...... చెప్పారు...

అక్కడక్కడా అచ్చు తప్పులున్నాయి చూసుకోండి

శిశిర చెప్పారు...

చాలా ఆవేశం, ఆలోచన ఉన్నాయి మీ టపాలో. బాగుంది.

మనసు పలికే చెప్పారు...

చాలా చాలా బాగుంది అశోక్..:)

అశోక్ పాపాయి చెప్పారు...

స్పందించిన ప్రతి ఒక్కరికి చాల ధన్యవాదాలండి.

శివరంజని చెప్పారు...

అశోక్ గారు చాలా బాగుంది ..చాలా ఎమోషనల్ గా రాసారనిపించింది ... మొన్నే ఈ పొస్ట్ కి కామెంట్ పెడదామనుకున్నాను కాని ఆ రోజు ఎందుకో మీ బ్లాగ్ ఓపెన్ కాలేదండి

kadambari చెప్పారు...

మంచి కావ్యావేశం
మీ శైలిని పదును పెట్టింది అశోక్ గారూ!
భలే ఫొటోను సంపాదించారు,link ఎక్కడిది?

{kadambari]