♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

28, అక్టోబర్ 2010, గురువారం

ఈ రోజు నా బుజ్జి భ్రమరం పుట్టినరోజండి


వీధి దాటి ఊరు దాటి మాత్రు దేశాన్ని వదిలి పరాయి దేశంలో ప్రవస ఆంధ్రున్ని
కాళ్ళకు కళ్ళెం, చేతులకు, సంకెళ్లు కండ్లకు గంతలు, ఆశకు అంతులు, వేసుకొని
ఘడియలు, క్షణలు, గంటలు, రోజులు, గడుపుతు నా జీవిత ప్రయణం

అంతలో

నీతో మాట ఉంది చెవిలో చెప్పాలి సమయం బాగుందని బ్లాగుతో ఒకరి పరిచయం

అబ్బో ఇదేదో బహు బాగుందని అని మెరిసింది నామదిలో ఏదో కలవరం

ఇంక ఆలోచనేలేదు అనుకోని లేఖిని పలకతో మొదలు పెట్టను నాబ్లాగు బడి

నామకరణంలో కొన్నిసార్లు మార్పులు మొత్తానికి బుజ్జి భ్రమరంగా మనసుతో పలికి

ఎలా రాస్తున్నానో నాపై నాకే అనుమానం ఎవరు చూడరు ఎవరు కనబడరు
అంటు కాలం గడుపుతున్న నాకు అడుగడుగున ఎదురైంది అశభంగం


కార్చలేని కన్నీటిని హృదయంలో నిలుపలేక కళ్లలో ఆపలేక
బుజ్జి భ్రమరం జల జల రాల్చేసిన కన్నీరుని చూసి అది నేను తాళలేక
అప్పుడు నాకు సిరివెన్నెల గుర్తొచ్చి బుజ్జిని ఓదారుస్తు ఇలా ప్రేమ ఒలిక


సరేలే ఊరుకో పరేషానెందుకో
చలేసే ఊరిలో జనాలె ఉండరా
ఎడారి దారిలో ఒయాసిస్సుండదా
అదోలా మూడు కాస్త మారిపోతే మూతి ముడుచుకునుంటారా
ఆటలోనో పాటలోనో మూడు మళ్ళీ మార్చుకోరా
మేరా నాం బ్లాగరు మేరా కాం తుంకు ఖుషి కరుం
నువ్వు నా చేతిలో ఓ బుజ్జి బ్లాగరు
anything కోరుకో క్షణల్లో హాజరు
ఖరీదేం లేదు కాని వాలుగా ప్రతి బ్లాగులోనా ఓ మైన
క్లాప్స్ కొట్టి ఈల వేసే స్పందన నీకు రాద

అంటు నా బుజ్జిని బుజ్జగించి చేశాను మళ్లి ఓ ప్రయత్నం
హారంతో అల్లుకోమని జల్లెడతో జతకలసి
మాలికతో మాటలాడి కూడలికి కూడ కబురంపింది

బుజ్జి భ్రమరం ప్రతి బ్లాగులోను వాలి సుమధుర మకరందా సువాసనాలు విరజిమ్మింది
భలే మాయ అపై మొదలు అయ్యయి కొత్త పరిచయలు హాయిని పంచే స్పందనలు
వారి ఆశీస్సులతో నేను రాసుకుంటు పోయను నా రాతలు మున్ముముందు

అల రాసుకుంటు వేదురుని తాకిన గాలి వేణునాధం అయిన కవితలతో, మనిషిబతుకులోని హీతభోద తెలిపిన వివేకనంద సూక్తులతో శ్రమ జీవుల కష్టాలని మరిపించే లయభరిత గానం జనపద గేయలతో అజరమరంగా రంజింపజేసింది నా బుజ్జి బ్లాగు వసంతం పూర్తి చేసుకోని మరో వసంతంలోకి అడుగు పెట్టిన సందర్బన మీరు నా బుజ్జి భ్రమరనికి కొంచెం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుదురు :))







22 కామెంట్‌లు:

..nagarjuna.. చెప్పారు...

బుజ్జి భ్రమరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు... :)

కొత్త పాళీ చెప్పారు...

బాగుంది. సంతోషం.
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఇందు చెప్పారు...

Happy birthday బుజ్జి భ్రమరం :)

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీ బుజ్జి భ్రమరం అందమైన పూలలోని మకరందాన్ని గ్రోలి ఆ మధురాన్ని మాకు ఎల్లప్పుడూ పంచుతూ తెలుగుబ్లాగుతోటలో హాయిగా విహరించాలని కోరుకుంటున్నాను.

మాలా కుమార్ చెప్పారు...

బుజ్జి భ్రమరం కు పుట్టిన రోజు శుభాకాంక్షలు .

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ బుజ్జిభ్రమరం తెలుగు సాహితీ వనాన పూసిన పూల తేనెను మరింతగా ఆస్వాదించి నవ్య తేనె రుచులను మాకందరికీ పంచాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు..

అశోక్ పాపాయి చెప్పారు...

నాగర్జున గారు... మీకు చాల దన్యవాదాలు చాల సంతోషమండి.

కొత్త పాళీ గారు... మీకు బాగుంది అంటే ఇంక నా బుజ్జి భ్రమరం బుగునంటేనండి.మీ శుభాకాంక్షలకు చాల కృతజ్ఞతలు.

ఇందు గారు..చాల సంతోషమండి మీకు కృతజ్ఞతలు.

విజయమోహన్ గారు...తెలుగుబ్లాగు తోటలో బుజ్జి భ్రమరం అందమైన పూలలోని మకరందాన్ని గ్రోలి మీ అందరికి మధురాన్ని అనునిత్యం పంచుతునే వుంటుందండి. మీ అముల్యమైన స్పందనకి చాల ధన్యవాదములు.

అశోక్ పాపాయి చెప్పారు...

మాలకుమార్ గారు...మీ రాక ఎంతో మాకు ఎంతో సంతోషమండి.మీ శుభాకాంక్షలకు చాల కృతజ్ఞతలు.


కెక్యూబ్ గారు...పుష్పాధరాల మధువులు గ్రోలుత మధుర వర్ణాల వలువలతో ఎగసి ఎగసి అలసి సొలసి పోయెంత వరకు మీరు చెప్పినట్టుగానే తెలుగు సాహితీ వనాన పూసిన పూల తేనెను ఆస్వాదిస్తూందండి.మీ శుభాకాంక్షలకు చాల కృతజ్ఞతలు కెక్యూబ్ గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

అందరికన్నా నేనే ముందుగా బుజ్జి భ్రమరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేబుదామనుకుంటే నాకన్నా ముందే చాలా మంది చెప్పేశారు.అయినా సరే "బుజ్జి" భ్రమరానికి అశోక్ "పాపాయి" కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బుజ్జిపాపాయి మరిన్ని పుట్టినరోజులు ఎంతో సంతోషంగా జరిపుకోవాలని భ్రమరం మారిన శోభాయమానంగా అందరి అభినందనలు అందుకోవాలని కోరుకుంటూ....-:)

venkata subbarao kavuri చెప్పారు...

బుజ్జి భ్రమరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

Geetika చెప్పారు...

బుజ్జి భ్రమరంకి హృదయ పూర్వక మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఎప్పట్నుంచో ఓ మాట చెప్పాలని మర్చిపోతున్నా... భ్రమరం ఫొటోతో పాటూ ప్రొఫైల్ ఫొటో కూడా చాలా బాగుంది.

జ్యోతి చెప్పారు...

బ్లాగ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు

మనసు పలికే చెప్పారు...

అశోక్.. ముందుగా బ్లాగు పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీ బ్లాగు ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, సెంచరీలు సెంచరీలు కామెంట్లు రావాలని, తెలుగు బ్లాగ్వనంలో అందరికీ నీ తియ్యని తెలుగు మాటల మూటల్ని అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
బుజ్జి భ్రమరం గురించి భలే రాశావే..:) చాలా బాగుంది. ఇంకా ఆ పేరడీ పాట కూడా..:))

అశోక్ పాపాయి చెప్పారు...

మంజు గారు ...అవున మీరే ముందుగా శుభాకాంక్షలు అయ్యయ్యొ పర్వలేదండి.మల్లి బుజ్జి భ్రమరం ఇంకో పుట్టనరోజుకి నేను ముందుగా మీకే తేలుయజేస్తాను అప్పుడు మీరే అందరికంటే ముందు కామెంట్ ఎడుదురు గాని :))
అవునండి శోభాయమానంగా అందరి అభినందనలతో పాటు మీ అభిమానం కూడ పొంది మళ్లి మళ్లి కొత్త శోభను బుజ్జి భ్రమరంలో సంతరించుకుంటనుండి.మీకు చాల ధన్యవాదములు మంజు గారు...


వెంకట సుబ్బారావు కావురి గారు ..నాబుజ్జి భ్రమరం తరపున నా తరపున మీకు చాల కృతజ్ఞతలు.


గీతిక గారు...ఎప్పట్నుంచో చెప్పాలనుకున్న మాట ఈరోజైన చెప్పారు చాల సంతోషమండి :))మీ బహుకల దర్షనము మాకు ఎంతో ఆనందదాయకండి..మీకు చాల కృతజ్ఞతలు

అశోక్ పాపాయి చెప్పారు...

జ్యోతి గారు...మీకు హృదయ పూర్వక మీకు కృతజ్ఞతలు.మీ శుభాకాంక్షలు బుజ్జి భ్రమరానికి నిత్యం కళకళాలాడే నిత్య వసంత వెలుగు దీపాలు.


అప్పు...ముందుగా నా బుజ్జి భ్రమరం నుండి నా నుండి మీకు నమస్సుమాంజలులు.అబ్బో మీయంత పెద్ద పెద్ద కామెంట్లు నా బ్లాగులో కూడ వస్తాయ చాల సంతోషం..:)) మీ ప్రోత్సాహం మీ ఆశీస్సులు ఉండలేకాని తేనె కన్న తీయనైన నా తెలుగు మాటలతో ఎన్నో వసంతాల కలబోత వేడుకనై మీ ముందుకు వస్తాను.

ఇంక ఆ టపా పేరడి మీరు అభిమానించే సిరివెన్నెల గారిది తెలుస??..:)))

మధురవాణి చెప్పారు...

Happy happy birthday to your blog! :)

మనసు పలికే చెప్పారు...

ఓ.. తెలియక పోవడం ఏమిటీ.. బ్రహ్మాండంగా తెలుసు..:)

అశోక్ పాపాయి చెప్పారు...

మధురవాణి గారికి కృతజ్ఞతలు చాల సంతోషమండి .

శిశిర చెప్పారు...

బుజ్జి భ్రమరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

అశోక్ పాపాయి చెప్పారు...

శిశిర గారు...మీ శుభాకాంక్షలకు చాల కృతజ్ఞతలు.

శివరంజని చెప్పారు...

అయ్యయ్యో... నేను వూరికి వెళ్ళడం వల్ల మీ పోస్ట్ చూడనే లేదండి ...sorry.అండి ....మీ బ్లాగ్ బర్త్ డే అని నాకు మీ పోస్ట్ చూసే వరకు తెలియదండీ..ఇప్పుడే చూసాను మీ పోస్ట్ ...

మీ బ్లాగ్ మరిన్ని టపాలతో మమ్మల్ని అలరించాలని ....ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను Happy birthday బుజ్జి భ్రమరం :)

అశోక్ పాపాయి చెప్పారు...

అయ్యో పోనిలెండి sorryలు ఎందుకండి మీ అభిమాననికి చాల చాల కృతజ్ఞతలు శివరంజని గారు...మీ అభిమానం ఇలాగె కొనసాగలని కోరుకుంటున్నాను..మీ శుభాకాంక్షలు మాకు చాల సంతోషమండి.