♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

2, జులై 2010, శుక్రవారం

ఏమని రాయను ప్రేమ????


ఏమని రాయమంటావు ప్రేమ నీ గురించి

మోడు వారిన జీవితంలో వసంతాలు పరిచయం చేసి

జీవితం అంటే అర్ధం చేప్పి ఎనలేని ధైర్యాన్ని ఇచ్చి

అర్ధంలేని జీవితంలో నీవే పరమర్ధమయ్యి

నిన్నటిదాక నా ప్రాణమే నీదని నేడు నీ ఎదనే తన్నీనప్పుడు


ఏమని పరిచయం చేయను ప్రేమ నీ సంపుటులు

ప్రేమలో అన్ని కలలు తియ్యనివని

ప్రేమకన్న దివ్యమైన మధుర్యమే లేదని

మనసు పోరల్లో దాగివున్న ప్రేమను జ్ఞాపకాల్ని

కవితలు రాసి వాటికి ప్రాణం పోసి

చివరికి వాటిని ప్రేమ కావ్యాలుగ మర్చినవారే

కలంలో నుండి వస్తున్నా శిరను ఆ కలంలోనే నేడు బంధీని చేసినప్పుడు


ఏమని పాడను ప్రేమ నీ గీతాలు

నీవు అందించిన క్రాంతితో జీవించి

ఎంతో ఇష్టంగా చీకటిని తోలగించుకోని

నీతో గడిపిన మధుర క్షణాలు ఎన్నో అని

నిన్న నీవే రేపు నీవే నాకల నీవే నా నిజం నీవే

ప్రేమలేనిది నేను లేను అన్నాస్వరాలే నేడు నీకు చరమగీతం పాడుతున్నప్పుడు




6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

బాగుంది :-)

హను చెప్పారు...

చాలా బాగుంది అశొక్ ముక్యంగా ఫొటో చాలా బాగుంది

అశోక్ పాపాయి చెప్పారు...

thanks a lot raadhika and hanu...

కవిత చెప్పారు...

very nice my brother....Photo exellent

అశోక్ పాపాయి చెప్పారు...

kavita sister chaala thanks

స్వామి ( కేశవ ) చెప్పారు...

మైండ్ బ్లోయింగ్ అన్నా ,
ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడానో ఇప్పుడే తెలుస్తుంది ..

కవిత సూపర్ ..అంతే