♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

7, జనవరి 2011, శుక్రవారం

తు నహీతో కుచ్ బీ నహీ


నీవు లేనిదే నా మనసు ఉండలేదని నీ పేరు లేనిదే నా ప్రేమ ఊహించలేనని
స్నేహమై వచ్చి ప్రేమగామారి నా కంటనీరు చిందినవేళ నేనున్నానని నను ఓదార్చి
ఎవరులేని ఒంటరి పయనంలో నీకు తోడు నేనని నా మసుసు తలుపులు తెరచి

అంతలోనే ఏమైందని అలా దూరంగా వెళ్లిపోతున్నావు..............???????????

నాపై నీకు ప్రేమ లేకుంటే ఇదంతా ఎందుకు చేశావు
ప్రేమే నేరమనుకున్న నీవు ఆ ప్రేమని నాకెందుకు పరిచయం చేశావు
కలనైనా నినుచూడక ఉండలేని నన్ను ఎందుకు కాదంటున్నావు
నీ చెలిని కావాలనుకున్ననా కోరికను ఆచరణ లేని నీ ఆలోచనతో
మన పరిచయం అంతా గతమే అన్నట్టు నా ప్రేమను ఆదిలోనే తుంచేస్తున్నావు
నను నడి సంద్రములో వదిలేసి తీరం చేరని మన ప్రేమను ఎందుకు ఆపుతున్నావు
నీలోగిలిలో చిరునవ్వుల విరబోత చూసి తరించాలన్న నా మధురోహల్ని ఎలా మరువను
ప్రతిక్షణం నాచిరునామా నీవే అనుకున్న నన్ను అసలు నిన్ను ఎలా మరిచిపోను

చెప్పు ప్రియా??....ఎక్కడికి పారిపోతున్నావు??
ఎందాక??.....ఎంతకాలం??......ఏదారి వెంట??

నిన్ను ప్రశ్నిస్తేనే నా జీవితం....నా జీవితం కోసం నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను
నా ప్రశ్నకి బదులులివ్వగలవా..??

7 కామెంట్‌లు:

Geetika చెప్పారు...

అశోక్ గారూ..

ఇది ఎవరినైనా ఉద్ధేశ్యించి వ్రాసిందా.. or మీరు ఫీలై వ్రాసిందా..?

ఏదైమైనా... చాలా భారంగా ఉంది...

భాను చెప్పారు...

బాగుంది మీ కవిత.

Ennela చెప్పారు...

అశోక్ గారు,
' పడ్డాడండీ ప్రేమలో మరీ" అనిపిస్తోందండీ నాకు మీ కవితలు చూస్తుంటే...

"నీలోగిలిలో చిరునవ్వుల విరబోత చూసి తరించాలన్న నా మధురోహల్ని ఎలా మరువను"ఈ లయిను నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది...

"చెప్పు ప్రియా??....ఎక్కడికి పారిపోతున్నావు??
ఎందాక??.....ఎంతకాలం??......ఏదారి వెంట??" -ఎడ్రెస్సు ఇస్తే నేను కనుక్కుంటాగా మీరు బెంగ పడకండి..

మరి మీ ప్రశ్నకి తొందరగా జవాబు రావాలని కోరుకుంటున్నా...

zylog.chirala చెప్పారు...

Ashok garu...

me kavitha chala chala bagundandi...

e rojullo nijamaina prema dorakatam chala kastam suma...

premanu premato chala premaga teliyachesarandi...danyavadalu..

Aruna.

అశోక్ పాపాయి చెప్పారు...

గీతిక గారు అది కొంచెం ఫీలై రాసిందే అనుకోండి.)).. భలే అడిగారు మీకు ధన్యవాదములు

భాను గారు కవిత నచ్చినందుకు చాల Thnaks andi:)

ఎన్నెల గారు....<<<<>>>>..హ హ హ హ....భలే భలే...ఖచ్చితంగా కనుక్కుందాం ఎడ్రెస్సు ఇస్తాను:))బుజ్జి భ్రమరం కవితలు చూసి చిరునవ్వు చిందించి తరించిన మీకు చాల చాల కృతజ్ణతలు:)

అరుణ గారు మీరు చెప్పింది చాల చాల నిజం.నేను రాసింది మీకు నచ్చినందుకు చాల Thnaks andi:))

చెప్పాలంటే...... చెప్పారు...

బాగుంది మీ కవిత లోని ఫీల్....అనుభూతిని అందం గా మీ మాటల్లో చెప్పారు

అశోక్ పాపాయి చెప్పారు...

Manju Gaaru Chaala Chaala Kruthagnathalu Meeku.