♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

11, అక్టోబర్ 2010, సోమవారం

తలచి తలచి చూస్తే....



నిన్న రాత్రి ప్రపంచ కౌగిలిలో నిద్రిస్తున్నప్పుడు ఒక్కసారిగా మెళుకువ వచ్చింది సఖి
ఎప్పుడో ఎక్కడో వీడిపోయిన నిన్ను అనుభూతి వెచ్చదనంగా దాచుకున్న డైరీని తెరిచాను

ఆశ ఆశయం ఆనందంతో రాసుకున్న అక్షరాలు రెప రెప లాడుతున్నాయి అని అనుకున్న
ఎమైందో ఎమోగాని తడుముతున్న ప్రతి అక్షరం నాకు ఆవేదనను మిగిల్చింది

ఎన్నో కలల కన్నీరై ఎన్నో ప్రేమల స్మృతి గీతలై
తెల్ల కాగితంలో ఇంకు చుక్కలై ఒక్కోక్కటిగా ఇంకిపోతున్నాయి

కలకాలం నిలివలేక కలసి నాతో రాలేక
కదలిపోయిన నీలా ప్రతి అక్షరం నా నుండి దూరం అవుతున్నాయి

అయిందెదో అయింది జరిగేదేదో జరిగింది అని అనుకుంటే
నీ కోసం వేచి వుండే నా నిత్య నిరీక్షణ వృధానే మరి

ఆవేదన మిగిల్చిన అక్షరాలని నిత్య నూతనంగా మళ్లి వెలిగిస్తాను
ఇంకు చుక్కలై ఇంకిపోతున్న ఆణిముత్యాలని నా రుధిరంతో రుద్ది మరి చక్కదిద్దుకుంటాను
దూరం అయిన ప్రతి అక్షరాన్ని ముద్దాడి సైతం నా హక్కున చేర్చుకుంటాను

వెళ్లిపోయిన నిన్నటి దినాన్ని మరచిపోయి వస్తావని రేపటి నాడు ''గా'' రాసుకోవడనికి

కాగితల్ని మళ్లి మళ్లి సవరిస్తూవుంటాను

ఎప్పుడో ఎక్కడో వీడిపోయిన నిన్ను ''ని'' ఈ కాగితల్లో రోజు వెతుకుతు వుంటాను

































8 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

>>కలకాలం నిలివలేక కలసి నాతో రాలేక
కదలిపోయిన నీలా ప్రతి అక్షరం నా నుండి దూరం అవుతున్నాయి
చాలా చాలా బాగుంది అశోక్ నీ కవిత..:) మంచి భావుకత్వంతో నిండి ఉంది.
Great job, keep it up..:)

చెప్పాలంటే...... చెప్పారు...

enta baagaa raasaaro!! kavita chalaa baagundi

jaggampeta చెప్పారు...

అక్షరాలే నిత్య యవ్వనం

అశోక్ పాపాయి చెప్పారు...

అప్పు...మెదట నా కవిత మిమ్మల్ని కదిలించినందుకు నేను చాల ధన్యున్ని మీరు నన్ను అలాగే మెచ్చుకుంటూ వెళ్లండి నేను రాసే కవితలు అనే రంగుల వర్షంలో మిమ్మల్ని తడిపేస్తాను :-)


చెప్పాలంటే గారు... నా కవితను ఆధరించినందుకు చాల కృతజ్ఞతలండి.

జగ్గమ్మపేట గారు.... చాల బాగ చెప్పారు మీకు చాల కృతజ్ఞతలండి.మీ పేరు భలే బాగుంది సార్ :-)

శివరంజని చెప్పారు...

చాలా బాగా రాశారు అశోక్ గారు ... ప్రతీ లైన్ చాలా చాలా బాగుంది

మాలా కుమార్ చెప్పారు...

కవిత బాగుంది .

అశోక్ పాపాయి చెప్పారు...

చాలా చాలా చాలా కృతజ్ఞతలండి మాలా కుమార్ గారు,శివరంజని గారు.

స్వామి ( కేశవ ) చెప్పారు...

"ఇంకు చుక్కలై ఇంకిపోతున్న ఆణిముత్యాలని నా రుధిరంతో రుద్ది మరి చక్కదిద్దుకుంటాను
దూరం అయిన ప్రతి అక్షరాన్ని ముద్దాడి సైతం నా హక్కున చేర్చుకుంటాను "

కవిత బాగా నచ్చింది .
బాగా ఉన్న రెండు లైన్లు కాపీ చేసి బ్యూటిఫుల్ అని రాద్దాం అనుకున్నా .
అలా అయితే మొత్తం కవితనే కాపీ చెయ్యాల్సి వస్తుంది ..

రుధిరం తో రుద్ధైనా చక్కబెట్టుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆణిముత్యాలెప్పటికీ ఇంకు చుక్కల్లా ఇంకి పోవు .

Keep Posting