♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic
చీకటి బ్రతుకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చీకటి బ్రతుకులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, మే 2010, బుధవారం

లైలా తుఫాను మా జీవితంలోనే పెను తుఫాను


నీలి ఆకశం పై వస్తున్న వర్షపు చుక్కవు నీవేనా?

ఇప్పుడు మొత్తం జనం మధిలో నీ నామమె

నీ రాక కోసం చూడని లోకమేది?

కాని

మా జీవితాలతో ఇల ఎప్పుడు ఎందుకు ఆడుకుంటావు

మబ్బువై వానవై ఉప్పెనవై మా బ్రతుకుల చీకటి దినాలకు కారణం నీవై

నీ ఉరుముల మెరుపులతో ఉగ్రరూపం చూపించి

మమ్మల్ని ఊరినుండే తరిమి తరిమి కొడతావు

మబ్బులు కమ్మినప్పుడు నీ మేఘర్జనకు భయపడిపోవాలి

నీవు కురుస్తున్నప్పుడు ఎక్కడ నీవు కాటువేస్తావని బిక్కు బిక్కుమంటు దాక్కోవాలి

చీకటి అలుముకున్నప్పుడు మా ప్రాణలు సైతం అరచేతిలో పెట్టుకోని వుండాలి

అదే నీవు శాసిస్తే

ఉరు వాడ ఇల్లు వాకిలి అన్ని వదిలి వుండిలేనివారిమై ఒంటరిగా పారిపోవాలి

కాని ఒక్కటి గుర్తుంచుకో

నీవు ఉరిమినా
నీవు మెరిసినా
నీ అలలు వచ్చి మమ్మల్ని తాకిన
నీ కెరటం ఉప్పెన అయినా
నీ ఆహ్లదానికి ఎర్రని తివాచి పరిచాము
కాని మాకు ఇప్పటికి తెలియలేదు

ఎగిసిపడే నీ అలల కెరాటాల్లో

మా అందరిని బంధించి మా ప్రాణలే హరిస్తావాని......