పొద్దు కాస్త పడమటింటికి జారుకుంది
చలిగాలికి మనుషులు, పశుపక్షాది,
కొండలు, కోనలు, పారే సెలయెళ్లు
వేడి ముసుగు వేసుకుని అప్పుడే నిద్రపోతున్నాయి
రెండు జంటలు మాత్రం నిద్రపోకుండా ఏమిటి
ఇక్కడ అని ఏవేవో చంద్రుని కుశల ప్రశ్నలు
మీకు తోడుగా మేము మేల్కోని ఉన్నాం సుమా
అన్నట్టు నక్షత్రాల చిలిపితనపు వంకర చూపులు
ఈ అర్ధరాత్రి చాల వింత అనుభూతినిస్తూంది కదా
అవును ఒకటి చెప్పు............
నాతో ఎదో చెప్పాలని ప్రయత్నించి ప్రతిసారి
విఫలమౌతున్నాను అని అంటావుగా మరి
ఇప్పుడు ఏమి సంభాషించక చలిమంటలకు
మూతి ముడుచుకుని కూర్చుంటే ఎలా??
మనసు తెరలు తెరచి నీ మనసున ఉన్నది ఏంటో చెప్పు
17 కామెంట్‌లు:
One of the hardest things in life is having words in your heart that you can't utter.
కవిత బాగుంది.
చాలా బాగుంది.కొన్ని మాటలు అంతే! అలా పెదవులదగ్గరే ఆగిపోతాయ్!కొన్నిసార్లు 'చెప్పు' అని అడిగేవాళ్ళు కూడా ఉండరు....హ్మ్! నైస్ పోస్ట్
హుర్రే హిప్ హిప్ హుర్రే...ఇంకొక మాంచి బ్లాగ్ దొరికేసిందొచ్...ఒకటి రెండు మెతుకులు ముట్టుకుని చూసా....కమ్మని వాసన గుప్పున కొట్టింది....ఆభినందనలు అశొక్ గారు...
అను గారు ..నా బ్లాగ్ కి స్వాగతం అవును మీరు అన్నట్టు చెప్పాలి కాని చెప్పగనే చెపుతున్నాది ఇదే ఇదే అదే అని.)).మీకు చాల చాల కృతజ్ఞతలండి కవిత నచ్చినందుకు
ఇందు గారు ....అయ్యబాబోయ్ మీరు భలే అన్నారు..మనసులో వున్న భావాలు అడిగిన అడగకపోయిన ఎది ఏమైన చెప్పకనే చెపుతున్నాది ఇదే ఇదే అదే అని.))).మీకు చాల చాల కృతజ్ఞతలండి కవిత నచ్చినందుకు.
ఎన్నెల గారు...నా బ్లాగ్ కి స్వాగతం ..ఇంకా అమ్మగారికి దండం బెట్టు అయ్యగారికి దండం బెట్టు హుర్రే హిప్ హిప్ హుర్రే నాకు కూడ మంచి బ్లాగ్ దొరికింది మరి మీ రంగుపడుద్ది టపాతో ఆ రంగుల వర్షంలో తడిసిపోయనండి...హా హ్హ హ్హ..మీకు చాల చాల కృతజ్ఞతలండి
చాలా బాగుంది అశోక్...
నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉన్న చలిరాతిరిలో గుసగుసలాడుకునే ఊసుల్లా ఉంది నీ కవిత.
అవునూ.. ఇద్దరు కనిపిస్తున్నారు.. రెండు జంటల్లో ఇంకో ఇద్దరేరి..?
మనసు తెరచి నా మనసున ఉన్నది చెపుదామనుకుంటే ఒక తుంటరి ప్రశ్ననన్ను చిలిపిగా అల్లరిపెడుతుంది .
నాదీ గీతిక గారి ప్రశ్నే బాసూ ..,
రెండు జంటలు అన్నావుగా
ఒకటి మీరిద్దరూ ( ఫోటో లో కనిపిస్తున్నారు )
రెండో జంట ? ( చంద్రుడు , భూమినా ? )
గీతిక....అబ్బో ఎంతయిన మీరు కవిత పండితులు ఎలాగైన కనిపెడతారు.అసలు అక్కడ రెండు గువ్వలు అని రాయబోయి రెండు జంటలు అని రాసాను హ హ్హ హ్హ:))
స్వామి (నాదా)....అవునా అంత అల్లరి పెడుతుందా నీ తుంటరి ప్రశ్నకు నా సమధానం నా మనసు తెరచి నా మనసున ఉన్నది రెండు గువ్వలు అని రాయబోయి రెండు జంటలు అని రాసాను...:))
.......కవితలు రాయడం ఒక వరం ..అది మీకు బాగా ఎక్కువిచ్చాడు దేవుడు ..చాలా చాలా చాలాబాగుంది
ఇంతకీ చెప్పారా? లేదా? :) ఇంతందంగా అడిగాక చెప్పకుండా ఎలా ఉంటారులెండి. ఏం చెప్పారో మరి? :)
చాలా బాగా రాశారు.
మీ ఆత్మియతకు నేను సర్వదా కృతజ్ఞున్ని శివరంజని గారు.మీ రాక నాకు ఎప్పుడు ఎంతో ఆనందం. మీకు చాల చాల ధన్యవాదములు.
హ హ హ శిశిర గారు మీరు మరి అన్ని ప్రశ్నల ఆ జంటకి ముందే సిగ్గు పాపం పోనిలెండి తర్వత చెపుతారు కావచ్చు..:)) మీకు చాల చాల ధన్యవాదములు.
Ashok గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
అశోక్ గారూ నూతన సంవత్సర శుభాకాంక్షలు
కెలుకుడు బురిడీ గాళ్ళు చాలా నయం, పవన్ గాడు వాళ్ళకంటే నీచుడు సరదాగా రాసిన ఒకే ఒక్క కామెంట్ ను పట్టుకుని నా పై వ్యక్తిగత దాడికి ప్రయత్నించాడు. మాలిక మలం పెంట ద్వార నా వివరాలు
సేకరించి బ్లాగు విషయాలను పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి కుటుంబ సభ్యుల్ని లాగి వారిని అడ్డుపెట్టుకొని నా బ్లాగు మూయించిన కిరాయి గూండా ఇలాంటి వాళ్ళను సామూహికంగా తోటి తెలుగు బ్లాగర్లు
బహిష్కరించాలి.ఇటువంటి నీచమైన సంప్రదాయాన్ని కలిసి కట్టుగా ఆపాలి
Thank U Very Much Sivaranjani And Bhaanu gaaru. And I Wish U The Same...:))
అశోక్ గారు,
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
sorry for the delay...I wish you and family a happy new year ashok gaaru
చెప్పమంటే మనసులోని మాట చెప్పడం చాలా కష్టం కదా!! కొన్ని చెప్పకుండా అర్ధం చేసుకోవాలి అశోక్
కామెంట్‌ను పోస్ట్ చేయండి