♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

13, డిసెంబర్ 2010, సోమవారం

జన్మ ఎత్తి నీకై జనించాను



అవును నేనే నేనే!!
ఆలుమగలైన మరుక్షణం విధి ఎక్కిరించన పనికి జీవితాంతం కలసి ఉంటామో లేదో
బరోసా ఏమో అన్న మాటలకి నిలువటద్దంగా నిలిచిన అబలని నేనే


అవును నేనే నేనే!!
అమ్మయి మనసు లతతో ఊరుకే పోల్చరా అనుభవజ్ఞులైన కవులు
తీగెలా అల్లుకోని మొదలు ఎండిన వీడకుంటుందని నిరుపించిన స్త్రీ మూర్తిని నేనే

అవును నేనే నేనే!!
ఆడది ఏక్షణం ప్రేమిస్తూందో మగడు ఎప్పుడు ద్వేషిస్తాడో అంత అయోమయం ఈ రోజుల్లో
మాంగల్యం అనే ఆభరణం వేసుకోని నీతోనే నడుస్తానంటున్నా అలుపెరగని ఆణిముత్యాన్ని నేనే


అవును నేనే నేనే!!
అయినవారు ఔనన్నా కాదన్నా మనం ఇద్దరం ఒకటే అని నీకోసమే నా బ్రతుకని
తడి ఆరని మా కన్నీళ్లు తుడిచే చెయ్యికోసం ఎదురుచూడక యాచిస్తున్న అర్ధాంగిని నేనే

నువ్వే నా ప్రాణమని.............నీవెంటనే నేను.......... మొత్తానికి నువ్వులేక నేను లేను

ఇకపై మన బ్రతుకు బాటలో



9 కామెంట్‌లు:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మీ కవిత బాగుంది. అందుకే స్త్రీ మూర్తిని ధరణితో పోల్చారు. మగాడు ఎన్ని ప్రగల్భాలు పలికినా ఆమె లేని జీవితం ఎడారి అని ఒప్పుకోక తప్పదు...

ఇందు చెప్పారు...

మీ కవిత చాలా బాగుందండీ...అలాగే ఆ అమ్మాయి పరిస్థితికి జాలి వేస్తోంది...కానీ తన ధైర్యానికి,భర్త పై ఉన్న ప్రేమకి ముచ్చటేస్తోందీ...

శిశిర చెప్పారు...

మీ స్పందన బాగుంది. ఆ అమ్మాయికి ఉపాధి దొరికితే బాగుండును.

అశోక్ పాపాయి చెప్పారు...

కెక్యూబ్ గారు...చాల చాల కృతజ్ఞతలు మీరు అన్నది నిజమే సార్ ఒప్పుకోక తప్పదు.

ఇందు గారు... చాల చాల కృతజ్ఞతలు అవునండి పాపం చాల జాలి వేస్తోంది..విధి ఆడిన నాటకానికి ఆ అమ్మయి బలి అయిపోయింది.


శిశిర గారు...మీ స్పందనకు కూడ చాల చాల కృతజ్ఞతలు మీరు అన్నట్టు అందరం అదే కోరుకుందాం

చెప్పాలంటే...... చెప్పారు...

స్త్రీ మూర్తిలోని కరుణ, దయ, జాలి అన్ని కలగలిపి వున్న కవితకి మంచి జరగాలని....
మీరు స్పందించి రాసిన తీరు చాలా బాగుంది అశోక్!!

kavita చెప్పారు...

స్త్రీ గురించి చాల బాగా రాసారు సార్.
తనని చుస్తే జాలి చేస్తుంది.
త్వరలోనే తనకు ప్రబుత్వం ఒక ఉపాదిని కల్పించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.

అశోక్ పాపాయి చెప్పారు...

మంజు గారు... ఇలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది.చాల చాల కృతజ్ఞతలు

కవిత గారు... అవునండి మనము అందరం అలాగే కోరుకుందాం.చాల చాల కృతజ్ఞతలు

zylog.chirala చెప్పారు...

hi...

me kavitha chala bagundandi, avunu magavadu enni tapulu chesina a badhanu anta okoka chuka kanetito abadhanu gundello nimpukuntundi, apatiki a gunde atanipi prematone nindipotundi, badhanu matram chupinchadu....premaku, atanu katte taliki unde viluva atuvantidi...mari..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
మీ కవిత చాలా చాలా బాగుంది. సమస్యా పూరణ నచ్చినందుకు ధన్య వాదములు