♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

23, ఆగస్టు 2010, సోమవారం

వస్తావు కదూ.......


నీతో కలసి వేసిన అడుగులు నా మదిలో ఇంకా శాశ్వంతగానే ఉన్నాయి
నీతో ఊహిస్తూ కన్న కలలన్ని చెదరని జ్ఞాపకాలు నను వెంటాడుతునే ఉన్నాయి
నీకు తెలుస........
రోదిస్తూ నేను కూర్చున్న రాయిసైతం నన్ను చూసి జాలిపడుతుంది
మరి నీవు మాత్రం మౌనం చెందిన తపస్విలా చెంతకు రావుకదా
ఇలా ఈ మౌనంలోని ఒంటరితనంలో వేదనతో నేనేమవుతానో నాకే తెలియదు
కాని నీ జాడ తెసిసేదాక ఈ నిరీక్షణ ఆగిపోదు నిను చేరేదాక నా ఆరధనా అలసిపోదు
ఎన్ని కష్టాలయినా ఎదురిస్తాను కన్నీళ్లతోటే నా పయనం అంటాను
ఆనందపు అంచులదాక వెళ్లి అందులోని తృప్తిని అస్వాదిస్తాను
వీడిపోని ఆశతో ఆగిపోని శ్వాసతో నీ ఎదురుచూపులో పరితపిస్తూ వుంటాను
ఆగ్రహించి నన్ను శాపించక కరుణించి నను చేరుకో నీ దానిని చేసుకో
సెలవంటూ వెళ్లిపోయి ఎడబాటు అయిన మన ప్రేమలో మళ్లి సేదతీరాలని
నువ్వు రావాలని............వస్తావని...........నీకై ఎదురుచూస్తానని............

12 కామెంట్‌లు:

హను చెప్పారు...

nice one...

డా.వి.ఆర్ . దార్ల చెప్పారు...

సాహిత్యం పట్ల మంచి అభిరుచి ఉన్నట్లు మీరు దాచుకున్న కవితలను బట్టి అనిపిస్తుంది.మీకు నా శుభాకాంక్షలు

మనసు పలికే చెప్పారు...

అశోక్ గారూ..! నేను మీ బ్లాగు ఎన్నో సార్లు చూశాను :) కానీ కొన్ని technical problems వల్ల వ్యాఖ్య పెట్టలేక పోయాను.. అదేంటో, పోస్ట్ లో embed అయిన కామెంట్ బాక్స్ లో నేను కమెంటలేక పోతున్నాను :( ఈ రోజు వేరే సిస్టం నుండి కామెంటుతున్నాను:)
నిజానికి మీ టపాలన్నీ నాకు నచ్చాయి.
"రోదిస్తూ నేను కూర్చున్న రాయిసైతం నన్ను చూసి జాలిపడుతుంది
మరి నీవు మాత్రం మౌనం చెందిన తపస్విలా చెంతకు రావుకదా.."
చాలా బాగుంది..

కవిత చెప్పారు...

Very nice My dear.....

మాలా కుమార్ చెప్పారు...

బాగుంది .

kadanbari చెప్పారు...

"నేను కూర్చున్న రాయిసైతం నన్ను చూసి జాలిపడుతుంది."

Nice.

శివరంజని చెప్పారు...

అబ్బో ఎంత బాగా రాసారండీ

అజ్ఞాత చెప్పారు...

Nice one...........

అశోక్ పాపాయి చెప్పారు...

మొదట ఇంత లేటుగా రిప్లే ఇస్తున్నందుకు నన్ను మన్నించగలరు నాకవితను ఇంతగ ఆదరించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదములండి...అప్పు హాయ్ హాయ్

భాను చెప్పారు...

naaku nachchindi

అశోక్ పాపాయి చెప్పారు...

bhanu gaaru mothaniki meeku nachidanna maata....thanks andi aa kavita nachinadduku

స్వామి ( కేశవ ) చెప్పారు...

"వీడిపోని ఆశతో ఆగిపోని శ్వాసతో నీ ఎదురుచూపులో పరితపిస్తూ వుంటాను"


నేను కూడా నీలాగనే
వీడిపోని ఆశతో ఆగిపోని శ్వాసతో నీ కొత్త పోస్టు కై ఎదురుచూపులో పరితపిస్తూ వుంటాను