♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

14, ఏప్రిల్ 2010, బుధవారం

దుబాయిలో.........




అదుగో అరబ్బుల అందాల నగరం
అంటూ పక్షుల్లా చేరాను ఇటు వాలి

మొదటి రోజుల్లో చూసారూ బంగారు గని
కాని నేడు చేయలని లేదు ఇక్కడ పని

తిరిగి వెళితే అమ్మ కాదనదు కానీ
వూరి వారు అంటారెమొ, వచ్చావా పని మాని

ఒంటరి తనం అనే వొనమాలు నేర్చుకోని
ఏకంగ ఏకాకినై జీవచ్చవంలా బ్రతికేస్తున్నా

ఇదేనేమో జీవితానికి మరుపురాని రోజు
తీరెదెన్నాళ్లకు దూర దేశం పై మోజు

8, ఏప్రిల్ 2010, గురువారం

నా బుజ్జి స్నేహం



అరై ................నీ స్నేహం నా అదృష్టం

నీవు పిలిచిన పిలుపు నా జీవితంలో ఒక అద్బుతం
వచ్చారు నా జీవితంలో ఎందరో కాని లేరెవ్వరు నీలా స్వచ్ఛంగా........

అరై కోతి నిను తలిస్తే వస్తాయి ఆశ్రువులు
కావవి శోక బిందువులు .........అవి ఆనంద బాష్పాలు........

అందుకే రా బుజ్జిగ నీ స్నేహం అదృష్టం
ఎన్నడు వీడిపోకు నన్ను...వీడిన ఆగిపోవు ఈ జీవితం.........

ఈ జీవితం నీ స్నేహనికే అంకితం
మనం ఇద్డరం ఇలాగె వుండాలి కాలకాలాం మరో జన్మలోను సైతం.....

నీ పలుకులు నాకు వీణ శ్రుతులు ..........నీ చిరునవ్వు ఒక చల్లని వెలుగు

నీతో మాట్లాడిన ప్రతిక్షణం ఓ మదుర జ్ఞాపకం
నీ మాట ఆగిన మరుక్షణం నా మనసు దు:ఖ సంద్రం........

అరై బుజ్జి విడిపోకు ఎన్నడు
వీడిన అగిపోవు నా శ్వస మరునాడు..........







14, ఫిబ్రవరి 2010, ఆదివారం

ప్రేమికుల రోజు




ప్రేమ రాహిత్యంతో యుద్డోన్మాదంతో రగిలిపోయిన నాటి రోమ్ చక్రవర్థి క్లాడియస్ కాలగర్బంలో మడిసిపోయడు. కానీ జంటలను కలిపే ప్రేమైకమూర్తి 'వాలెంటైన్ మాత్రం నేటికి వెలిగే సజీవమూర్తి.దిక్కర నేరనికిగాను క్రీ.శ.270లో ప్రాణాలర్పించిన వాలెంటైన్ జీవిత సందేశం స్వచ్చమైన ప్రేమే! వాలెంటైన్స్ డే మాతాలకు అతీతమైన ప్రేమికుల రోజు పండుగ. జంటలైన ప్రేమికులు సరే! మరి ఒంటరివారి మాటేమిటి వారు వాలెంటైన్స్ డే జరుపుకోవచ్చు. కొందరు దానికి పెట్టిన పేరు సింగిల్ అవేరెనెస్ డే (ఎస్-ఎ-డి). ప్రేమని గురించి ఆలోచించాల్సిన రోజది అన్నట్టు వాలెంటైన్స్ డే అన్నది జంటల పండుగ మాత్రామే కాదు, అది విశ్వప్రేమ భావనకు ప్రతీక.




ప్రేమ

ప్రేమ - రెండుక్షరాలు

ప్రేమ ఎంతో బలియమయింది

ప్రేమ విలువ ప్రేమించిన వారికే తెలుస్తుంది

ప్రేమ ఎందరితోనో ఎన్నో రకాలుగా ఆడుకుంది

ప్రేమ సృష్టి వున్నంత వరకూ వుంటుంది

ప్రేమకు మరణం లేదు!

అందుకే - ప్రేమికుల రోజున ప్రేమికులు ప్రేమను పంచుకుంటారు

చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి

కొన్ని కాలగర్బంలో కలసిపోతే

మరి కొన్ని శాశ్వతంగా నిలిచిపోయాయి.............