♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic
ఆవేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆవేదన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, జూన్ 2010, ఆదివారం

ప్రేమలో మోసపోయను నేను!!!



కాలేజిలో నను చూసి హల్లో అని చెప్పి ఓ తియ్యని మట కలిపావు
హాయ్ కాదు కదా నీమొహం కూడ చూడలేదు ఆ రోజు

మరునాడు నా పలుకుల్లో స్వరం లేదా నీవు గమనించవో లేదో గాని
గమనిస్తే నీ పెదాల కదలికను చూడలని ఆశగా వుంది అని అన్నావు

అనాటి నుండి ప్రతిరోజు ఎదురయ్యి నన్ను పలకరించేల చేసుకున్నావు
అడగకుండనే ఓ దినం సహయం చేశావు నిన్ను అభిమానించ

నీ గతమంతా చెప్పావు నేను సంతోషించా నీ మాటలు విని పులకించా
ఒకరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నానని అమయకుడిల అడిగావు
ఆలోచించ కాని నిను నమ్మి ఆపై ఆరాధించా

మరుసటి రోజు నీవె నా ప్రాణం నీవె నా దైవం
నీకోసం పుట్టాను నీకోసమే పెరిగానని
నువ్వు లేనిది నా జీవితం లేదని బాసలేన్నో చేసి నను బానిసగ మార్చి
ఏవేవో మాయ మాటలు చెప్పి నా తనువంత దోచుకున్నావు
ఇంక నా జీవితం నా అనురాగం నా అందం అన్ని నీతోనే అనుకున్న

మరి నేడు ప్రియ నిను నేను వరించలేను అని తెలిసినప్పుడు
ఏమి చెయ్యను నేను? నీ కిరాతక ప్రేమలో పడినందుకు
నిన్ను ద్వేషించలా? లేక నేను మరణించలా?
ఇప్పుడు ఏమి చెయ్యను నేను? ఏమి చెయ్యను నేను?

14, ఏప్రిల్ 2010, బుధవారం

దుబాయిలో.........




అదుగో అరబ్బుల అందాల నగరం
అంటూ పక్షుల్లా చేరాను ఇటు వాలి

మొదటి రోజుల్లో చూసారూ బంగారు గని
కాని నేడు చేయలని లేదు ఇక్కడ పని

తిరిగి వెళితే అమ్మ కాదనదు కానీ
వూరి వారు అంటారెమొ, వచ్చావా పని మాని

ఒంటరి తనం అనే వొనమాలు నేర్చుకోని
ఏకంగ ఏకాకినై జీవచ్చవంలా బ్రతికేస్తున్నా

ఇదేనేమో జీవితానికి మరుపురాని రోజు
తీరెదెన్నాళ్లకు దూర దేశం పై మోజు