♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

3, జూన్ 2010, గురువారం

ఒక స్నేహం - ఒక ప్రేమ




ఒక స్నేహం........

ఓ అందమైన నేస్తమా!
క్షణకాలం నిలువుమా
నా బాధలో తోడు నీవు
నా కన్నీళ్ళకు భవ్యం నీవు
నా ఒంటరితనానికి చేయూత నీవు
నీవు లేని క్షణం నాకు మరణమే క్షణం క్షణం
నను వదిలి ఎచటకు నీ ప్రయణం?

ఒక ప్రేమ........

ఓ ప్రియ నువ్వంటే నాకు ఎంతో ఇష్టం
నీ కళ్ళల్లోకి చూస్తుంటే సిగ్గు అనిపించదు
మౌనంగా ఉన్న విసుగనిపించదు
నీవు దూరమైతే ఆవేదన ఎప్పుడు నీకై ఆలోచన
అందుకే మరి
నీలి నింగిని సైతం చేరుకుంటాను
సప్త సముద్రాలు సైతం ఈదుతాను
నింగి నేల వున్నంతవరకు వేచివుంటాను
నీ ప్రేమకోసం నీవు ఇచ్చే పువ్వుకోసం

ఒక స్నేహం, ఒక ప్రేమ........

ఆకాశం అసూయ పడుతున్నది నా మీద
నక్షత్రాలకు పెరుగుతున్నది కోపము అంతులేనంత
ప్రజల హృదయాలు రగులుతున్నాయి భరించలేనంత
ఎందుకు?
చంద్రుని మించిన ఒక స్నేహం, ఒక ప్రేమ నాకు సొంతమైనందుకు








26, మే 2010, బుధవారం

కదల్లేని అమ్మకు.........మేమే అమ్మ నాన్న



ఎక్కడుంది మానవత్వం
కీర్తిలోనా? కాంక్షాలోనా?
ఎక్కడుంది నూతనత్వం
ఆశలోనా? ఆశయంలోనా?

అమ్మ

నీ జోలా పాటాతో మురిపించి
మాకు ఈ జగాన్ని మైమరపించవు

అమృతాన్ని ముద్దలుగా చేసి మా నోటికి అందించవు
అబలంతో నీవున్న బండిని లాగుతాం

నీ వొతిళ్ళ మధ్య చలికి వొణకగా
వెచ్చగ ఉంచిన నిను ఎలా మరువగలము

నవమాసాలు మోసి మము కనిన
అనురాగాపు అమృత తల్లివి నీవు
నిను మేము నాలుగు అడుగులు మోసుకెల్లలేమ

అపురూపంగా మా హృదయంలో నిలిచే
మహొన్నత దేవతవు నీవు

కాని ఒక్క విషయం

తల్లి కన్న ప్రేమకు
తల్లి కున్న ప్రేమకు
తల్లి అన్న మాటకు
విలువెంతని ప్రశ్నిస్తే?
ఈ ముగబోయినా లోకానికి తెలియదు

ఎవరు వస్తే ఏంటి? రాకపోతే ఏంటి?

చిన్నతనంలో మాకు వచ్చిన చిన్న జ్వరానికే తల్లడిల్లిన నీవు
నీకు వచ్చిన అర్దంకాని జ్వరానికి నిను అంటిపెట్టుకుని వుండి
నిను కాపాడుకుంటాము అమ్మ నిను కాపాడుకుంటాము






22, మే 2010, శనివారం

నీ కోసం ఈ నిరీక్షణ



నీ కోసం ఎదురుచుస్తువుంటాను
నీవు రావని తెలిసినా

నను వీడి నీవు వెళిపోతున్నావు
కాని నా మనసు మాత్రం నీతోనే వుంది

నీవు వెనుతిరిగి చుడకున్నా
మరి నేను నీ కోరకే చుస్తున్నా

బ్రతుకైనా నీతోనే చితికైనా నీతోనే
చూసే నా కన్నులు రెండు అలనిపోయాయి
కాని వేచి చూసే నా మనసు నీ పేరే తలుస్తుంది
నా జీవితం కనుమరుగువ్వటానికి
అరక్షణం ముందు నీ ప్రేమ పొందినా చాలు

నీకోసం వెయ్యి జన్మలు సైతం నిరీక్షిస్తాను