♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

26, డిసెంబర్ 2010, ఆదివారం

చలిరాతిరి


పొద్దు కాస్త పడమటింటికి జారుకుంది
చలిగాలికి మనుషులు, పశుపక్షాది,
కొండలు, కోనలు, పారే సెలయెళ్లు
వేడి ముసుగు వేసుకుని అప్పుడే నిద్రపోతున్నాయి
రెండు జంటలు మాత్రం నిద్రపోకుండా ఏమిటి
ఇక్కడ అని ఏవేవో చంద్రుని కుశల ప్రశ్నలు
మీకు తోడుగా మేము మేల్కోని ఉన్నాం సుమా
అన్నట్టు నక్షత్రాల చిలిపితనపు వంకర చూపులు
ఈ అర్ధరాత్రి చాల వింత అనుభూతినిస్తూంది కదా
అవును ఒకటి చెప్పు............
నాతో ఎదో చెప్పాలని ప్రయత్నించి ప్రతిసారి
విఫలమౌతున్నాను అని అంటావుగా మరి
ఇప్పుడు ఏమి సంభాషించక చలిమంటలకు
మూతి ముడుచుకుని కూర్చుంటే ఎలా??
మనసు తెరలు తెరచి నీ మనసున ఉన్నది ఏంటో చెప్పు

13, డిసెంబర్ 2010, సోమవారం

జన్మ ఎత్తి నీకై జనించాను



అవును నేనే నేనే!!
ఆలుమగలైన మరుక్షణం విధి ఎక్కిరించన పనికి జీవితాంతం కలసి ఉంటామో లేదో
బరోసా ఏమో అన్న మాటలకి నిలువటద్దంగా నిలిచిన అబలని నేనే


అవును నేనే నేనే!!
అమ్మయి మనసు లతతో ఊరుకే పోల్చరా అనుభవజ్ఞులైన కవులు
తీగెలా అల్లుకోని మొదలు ఎండిన వీడకుంటుందని నిరుపించిన స్త్రీ మూర్తిని నేనే

అవును నేనే నేనే!!
ఆడది ఏక్షణం ప్రేమిస్తూందో మగడు ఎప్పుడు ద్వేషిస్తాడో అంత అయోమయం ఈ రోజుల్లో
మాంగల్యం అనే ఆభరణం వేసుకోని నీతోనే నడుస్తానంటున్నా అలుపెరగని ఆణిముత్యాన్ని నేనే


అవును నేనే నేనే!!
అయినవారు ఔనన్నా కాదన్నా మనం ఇద్దరం ఒకటే అని నీకోసమే నా బ్రతుకని
తడి ఆరని మా కన్నీళ్లు తుడిచే చెయ్యికోసం ఎదురుచూడక యాచిస్తున్న అర్ధాంగిని నేనే

నువ్వే నా ప్రాణమని.............నీవెంటనే నేను.......... మొత్తానికి నువ్వులేక నేను లేను

ఇకపై మన బ్రతుకు బాటలో



5, డిసెంబర్ 2010, ఆదివారం

నీ కోసం



ప్రతి రోజు నా గురించి పరితపించే నీవు

ఒకమారు నీ అందాన్ని పొగిడి నీ అధరాలపై ఒక ముత్యపు నవ్వు తెప్పించాలని

పక్కనున్న పెరడులో కన్నేసి అందమైన గులాబీ పూలు దోచేసి ముల్లును తాక

తియ్యగా దాని లక్షణంతో నను ఎంతో భాదించినా మధురంగానే భావించా

మది నిండా నీ ఆలోచనలతో ఇంటికి చేరుకొని పడక పై శయనిస్తూ నేను

కొన్ని క్షణాలు ఈలోకాన్ని మరచిపోయి సాగిపోతున్నా నా నిద్దురలో పదే పదే నువ్వే

అంతలో నేను దాచుకున్న పూలలో నిను చూద్దామని చూస్తే దొంగిలించినది కాబోలు

నీతో ముచ్చటిస్తూ నే ముట్టిన ప్రతి పువ్వు నను విడిచి ముచ్చటగా రాలిపోతున్నవి

కాని పాపం చివరన మిగిలింది ఒకేఒక గులాబి మన ప్రేమకి అదే మన ప్రసూనము

మన ఎడడుగుల బంధానికి చేరువకావటానికి ఒకేఒక పువ్వు చాలు అనుకోని

అమయక ప్రేమ పక్షిలా ఒక్కసారిగా నీ ముందర వాల

ఈ పువ్వుని తీసుకొని నీ పెదాలపై చిరునవ్వు చిందించవు

నను మైమరపించవు ప్లీజ్....................