♫ మా తెలుగు తల్లికి మల్లెపూదండ ♫

Image and video hosting by TinyPic

23, ఆగస్టు 2010, సోమవారం

వస్తావు కదూ.......


నీతో కలసి వేసిన అడుగులు నా మదిలో ఇంకా శాశ్వంతగానే ఉన్నాయి
నీతో ఊహిస్తూ కన్న కలలన్ని చెదరని జ్ఞాపకాలు నను వెంటాడుతునే ఉన్నాయి
నీకు తెలుస........
రోదిస్తూ నేను కూర్చున్న రాయిసైతం నన్ను చూసి జాలిపడుతుంది
మరి నీవు మాత్రం మౌనం చెందిన తపస్విలా చెంతకు రావుకదా
ఇలా ఈ మౌనంలోని ఒంటరితనంలో వేదనతో నేనేమవుతానో నాకే తెలియదు
కాని నీ జాడ తెసిసేదాక ఈ నిరీక్షణ ఆగిపోదు నిను చేరేదాక నా ఆరధనా అలసిపోదు
ఎన్ని కష్టాలయినా ఎదురిస్తాను కన్నీళ్లతోటే నా పయనం అంటాను
ఆనందపు అంచులదాక వెళ్లి అందులోని తృప్తిని అస్వాదిస్తాను
వీడిపోని ఆశతో ఆగిపోని శ్వాసతో నీ ఎదురుచూపులో పరితపిస్తూ వుంటాను
ఆగ్రహించి నన్ను శాపించక కరుణించి నను చేరుకో నీ దానిని చేసుకో
సెలవంటూ వెళ్లిపోయి ఎడబాటు అయిన మన ప్రేమలో మళ్లి సేదతీరాలని
నువ్వు రావాలని............వస్తావని...........నీకై ఎదురుచూస్తానని............

15, ఆగస్టు 2010, ఆదివారం

లాల్ సలాం ఓ సైనికులారా


దేశ ప్రగతి కోసం పగలు రేయి అనక పరవశించి పరుగులు పెడుతు
కనులుతేరచిన క్షణం నుండి ఎంతటి కష్టాన్ని అయిన ఆనందంగా భరిస్తూ
దూది వొత్తులతో చీకటిని పాలద్రోలి అనునిత్యం వెలుగును నింపుతున్నారు

నాన్న రాక కోసం తన బిడ్డల ఎదురుచూపులు తెలియవు వీరికి
పోరులో మరణించయిన సరే దేశ భవిష్యత్తు కాపాడాలి అని ఆలోచన
ప్రతి సైనికుడికి

దొంగ పాకిస్తాన్ తుపాకి తుటాలకు రాలిపోతున్న ప్రాణాలు కూడ లెక్క చేయక
''వందేమాతరం'' అంటు నేలకొరుగుతు అంబరాన్నంటిన అరుపునకు
అందుకోండి మా సలాం ఓ భారతమాత ముద్దు బిడ్దలార

దేశం కోసం ఏస్వార్ధం లేని ప్రేమను పంచుతు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండ

భారతమాత సేవలో అనుక్షణం పునీతులగుచున్న వీరసైనికులారా
మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగల సలాం చేయడం తప్ప

వెల కట్టలేని మీ త్యాగలకు ధైర్యసాహసాలకు జోహర్లు

మీకు వందనం! శతకోటి అభినందన చందనం!!..భారతమాతకి జై.....జై హింద్

































23, జులై 2010, శుక్రవారం

మరలి రా తరలి రా స్నేహమ




గుప్పిట పట్టిన జ్ఞాపకాలన్నీ అవిరైపోయిన సంగతి
పాము కాటుల అనుభవమయ్యక చివరకు మిగిలిన

నిద్రకు ముందు ఓ దుఃఖపు వ్యాయమం
వేకువ జామునరెండు కన్నీటి బొట్లను రాల్చుకోవడం
భయదస్పృహల మధ్యే అయినాప్రాణం పదిలంగానే ఉంది కదా

రవంత దుఃఖనందమేదోఅనుభవానికొస్తూనే ఉంది కదా
నిలువెల్లా గయపడిన మన స్నేహం గురించి కొందరికి వినిపిస్తే

మన మీద జాలిపడిన హ్రృదయలు కొన్ని అయితే
మాటడలేక ముగబోయిన మనసులు మరి కొన్ని

స్నేహమయి ఈ రోజును సైతం ఒంటరినై గడిపేస్తున్న
కనుమరుగై పోయిన మన స్నేహ జ్ఞాపకాల్లో మునిగిపోతున్నా


నాలో కొత్త ఊపిరి నింపుతావని విశ్వాసమే ఊపిరిగా బతికేస్తున్నా
కన్నీరే ప్రవాహమై శిలనై గుమ్మం దగ్గర ఎదురుచూస్తునే వున్నాను
నువ్వు ఏరోజుకైన తిరిగి వస్తావని స్నేహమ..................